Ashneer Grover : ఏం చేస్తామనేది చెప్పం..కానీ నాతో కలసి 5 ఏళ్లు పనిచేస్తే మెర్సెడెజ్ కారు గిఫ్ట్ ఇస్తా: అష్నీర్ గ్రోవర్

ఏం చేస్తామనేది చెప్పం..కానీ నాతో కలసి ఐదేళ్లు పనిచేస్తే మెర్సెడెజ్ కారు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్.

Ashneer Grover : ఏం చేస్తామనేది చెప్పం..కానీ నాతో కలసి 5 ఏళ్లు పనిచేస్తే మెర్సెడెజ్ కారు గిఫ్ట్ ఇస్తా: అష్నీర్ గ్రోవర్

BharatPe founder Ashneer Grover new startup

Updated On : January 11, 2023 / 3:44 PM IST

BharatPe founder Ashneer Grover new startup : ఏం చేస్తామనేది చెప్పం..కానీ నాతో కలసి ఐదేళ్లు పనిచేస్తే మెర్సెడెజ్ కారు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్. 40 ఏళ్లకే రెండు స్టార్టప్ లను విజయవంతంగా ప్రారంభించిన అష్నీర్ గ్రోవర్..తాజాగా తన భార్యతో కలిసి మరో స్టార్టప్ ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టార్టప్ కోసం తనతో కలిసి ఐదేళ్లు పనిచేస్తే మెర్సిడెజ్ కారు గిఫ్టుగా ఇస్తానని ప్రకటించారు. మూడో స్టార్టప్ మొదలుపెట్టే పనిలో ఉన్న అష్నీర్ గ్రోవర్ తద్వారా పెట్టుబడులను కూడా కోరుతున్నారు. కానీ ఎటువంటి వ్యాపారం ఎటువంటి ప్లాన్లు అనేది మాత్రం చెప్పనంటున్నారు.

భారత్ పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ..షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 1 గ్రోవర్ అంటే మాత్రం ఠక్కున తెలిసిపోతుంది. ఎందుకంటే భారత్ పే బోర్డు సీఈవోగా కొన్ని అవకతవకలకు పాల్పడినట్టు ఆయనతోపాటు ఆయన భార్య మాధురి జైన్ ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలతో కంపెనీలో తనకు ఎక్కువ శాతం వాటాలున్నా కంపెనీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవి అంటూ అష్ణీర్ గ్రోవర్ లీగల్ గా పోరాడుతున్నారు.

షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమం ఏర్పాటులో కూడా అష్నీర్ గ్రోవర్ పెట్టుబడులు పెట్టారు. ఈక్రమంతో తాజాగా తాను తాను సొంతంగా మరో స్టార్టప్ ప్రారంభిస్తున్నానని ప్రకటిస్తూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టారు. నాతో కలిసి పనిచేయాలనుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తన కొత్త ప్రాజెక్ట్ పూర్తి దేశీ విధానంతో ఉంటుందని స్పష్టంచేశారు. ఈ స్టార్టప్ 50మందితో ప్రారంభమవుతుందని తెలిపారు.. తదుపరి టోడు-ఫోడులో భాగం కావాలంటే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు.

తమ కంపెనీలో భారతీయులు ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చని..వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లను దగ్గరకు రానివ్వబోమని తేల్చి చెప్పారు గ్రోవర్. తమ మూడో స్టార్టప్ మార్కెట్ ను షేక్ చేస్తుందని..అటువంటి స్టార్టప్ ను చడీచప్పుడూ లేకుండా ప్రారంభించబోతున్నామని చాలా వినూత్నంగా ఇది ఉంటుందని తెలిపారు. ఈ కొత్త కంపెనీ కేవలం 50 మందితోనే ప్రారంభమవుతుందని తెలిపిన గ్రోవర్ ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కానీ తాము ప్రారంభించేది ఏంటీ అనే విషయం మాత్రం చెప్పనని TODU – FODU అంశంలో భాగం కావాలనుకుంటే ఆసక్తి  ఏం ప్రారంభిస్తామనేది బిలియన్ డాలర్ల ప్రశ్న’’ అంటూ ఆసక్తిని పెంచారు గ్రోవర్. తన కొత్త స్టార్టప్ లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే ప్రతీ ఉద్యోగికి మెర్సెడెజ్ బెంజ్ కారును కానుకగా ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు.