రెస్టారెంట్లను ఆదుకోవడానికి బ్రిటన్లు 10కోట్ల సార్లు బైటకెళ్లి తిన్నారు!

కరోనా సంక్షోభంతో పర్యాటకపరంగానే కాదు.. హాస్పిటాలిటీ (ఆతిథ్య) రంగాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.. కరోనా భయంతో బయటకు వచ్చేవారు కరువై నష్టాల బాటలో నడుస్తున్నాయి.. కరోనా దెబ్బకు కుంగిపోయిన హాస్పిటాలిటీ సెక్టార్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు బ్రిటన్ ఛాన్సలర్ అయిన రిషీ సునాంక్.
రెస్టారెంట్లను ఆదుకునేందుకు ‘ఈట్ ఔట్.. హెల్ఫ్ ఔట్’ అనే కార్యక్రమంతో రిషీ ముందుకొచ్చారు.. ఇందులో భాగంగా బ్రిటన్ వాసులందరిని బయటకు వచ్చి రెస్టారెంట్లలో ఫుడ్ తినాలని ఆఫర్ ఇచ్చారు.. పైగా డిస్కౌంట్ కూడా ఆఫర్ చేశారు.. అంతే.. బ్రిటన్లంతా బయటకు వచ్చి రెస్టారెంట్లలో తినడం మొదలుపెట్టారు.. ఒకటి కాదు. వంద కాదు.. ఏకంగా 10 కోట్ల సార్లు బయటకొచ్చి రెస్టారెంట్లలో మీల్స్ ఆరంగించారంట..
ఇలా రెస్టారెంట్లకు వచ్చి ఫ్యామిలీలతో మీల్స్ చేసేవారికి 50 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ పై 10 పౌండ్ల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. గత ఆగస్టులో సోమవారం నుంచి బుధవారం మధ్యవారాల్లోనే అంట.. ఈ కార్యక్రమం సక్సస్ కావడంతో రెస్టారెంట్లలో బుకింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇంట్లో ఉండొద్దు.. ఆఫీసులకెళ్లండి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి అంటూ సలహా ఇచ్చిన రిషీ.. ఇప్పుడు హాస్పిటాలిటీ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాని చెప్పుకొచ్చారు..
ఈ మిషన్ లో సాయపడిన ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్కీమ్ కేవలం ఉద్యోగాల కోసమే కాదన్నారు.. ఉద్యోగుల భద్రతతో పాటు యాజమాన్యాలకు అలాగే కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలని ఆకాంక్షించారు.. అప్పుడే దేశం బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు. 2019లో ఇదే రోజుతో పోలిస్తే చివరి రోజున సోమవారం నాటితో రెస్టారెంట్లలో 216 శాతం మేర బుకింగ్స్ పెరిగాయని చెప్పారు..
ఈట్ ఔట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాటికి 84,700 రెస్టారెంట్లలో 1,30 వేల బుకింగ్స్ నమోదయ్యాయని రిషీ వెల్లడించారు. అంటే ఈ బుకింగ్స్ ధర దాదాపు 522 మిలియన్ల డాలర్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. కొన్ని రెస్టారెంట్లలో పిజ్జా హట్, బిల్స్ వంటి ఫుడ్ ఆఫర్లతో కూడా భారీగా బుకింగ్స్ నమోదయినట్టు రెస్టారెంట్ల యజమాన్యాలు తెలిపాయి.
హాస్పిటాలిటీ రంగానికి అవసరమైన ప్రోత్సాహం ఒక్క ఆగస్టులోనే లభించదని.. దాని కారణంగానే రెస్టారెంట్లలో భారీ స్థాయిలో మీల్స్ బుకింగ్స్ అయినట్టు పలు నివేదికలు తెలిపాయి. బ్రిటన్‌లో ఆర్థిక తిరిగి పుంజుకోవడానికి దోహద పడుతుందని అంచనా వేస్తున్నాయి.