BSNL అదిరిపోయే ఆఫర్: వారి కోసం కొత్త ‘సమ్మాన్ ప్లాన్’.. ఏకంగా ఏడాది పాటు వ్యాలిడిటీ.. అంతేకాదు..
ఏడాది కాలం పాటు డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇతర లాభాలు కలిగిన మొబైల్ కనెక్టివిటీని అందిస్తుంది.

BSNL Samman Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 60 ఏళ్లు పైబడిన వారి కోసం ప్రత్యేకంగా “సమ్మాన్ ప్లాన్” పేరుతో కొత్త వార్షిక మొబైల్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ఛార్జి రూ.1,812. ఇది ఏడాది కాలం పాటు డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇతర లాభాలు కలిగిన మొబైల్ కనెక్టివిటీని అందిస్తుంది.
సమ్మాన్ ప్లాన్ వివరాలు
ఈ ప్లాన్‌ను BSNL అధికారిక వెబ్‌సైట్, BSNL సెల్ఫ్-కేర్ యాప్, అధికారిక రిటైల్ స్టోర్‌ల ద్వారా పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ 2025 నవంబర్ 18 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
BSNL సమ్మాన్ ప్లాన్: ధర, లాభాలు
- ఇంటర్నెట్ వినియోగదారులకు సరిపడా రోజుకు 2GB హై-స్పీడ్ డేటా.
- టెక్స్ట్ మెసేజ్‌లకు ఎటువంటి ఆటంకం కలుగకుండా రోజుకు 100 SMSలు
- అపరిమితంగా మాట్లాడే వారికోసం అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్
- కొత్తగా BSNLలోకి వచ్చే కస్టమర్లకు ఉచితంగా సిమ్.
6 నెలల BiTV ఉచిత సబ్‌స్క్రిప్షన్
సులభమైన కనెక్టివిటీ, తక్కువ ధరల్లో ఎక్కువ ప్రయోజనాలు కల్పించడం ద్వారా BSNL తన వినియోగదారుల సంఖ్యను పెంచాలన్న యత్నంలో భాగంగా ఈ ప్లాన్ తీసుకొచ్చింది.
కొత్త కస్టమర్ల కోసం రూ.1కే 4G ప్లాన్
సమ్మాన్ ప్లాన్‌తో పాటు, BSNL ఒక ప్రత్యేకమైన దీపావళి బోనాంజా ఆఫర్‌ను ప్రకటించింది.
- కేవలం రూ. 1కే 4G ప్లాన్
- రోజుకు 2GB 4G డేటా
- రోజుకు 100 SMSలు
- KYC పూర్తిచేసిన తర్వాత ఉచిత సిమ్ యాక్టివేషన్
- 30 రోజుల ప్లాన్ వ్యవధి
ఈ ఆఫర్ 2025 నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రధానంగా BSNL కొత్త వినియోగదారులకు 4G నెట్‌వర్క్‌ను పొందే అవకాశం కల్పించడాన్ని లక్ష్యంగా తీసుకొచ్చింది.
ఫెస్టివ్ డిస్కౌంట్లు – సెల్ఫ్‌కేర్ యాప్ & వెబ్‌సైట్ ద్వారా..
రూ. 485, రూ. 1,999 ప్లాన్‌లపై 5% పండుగ డిస్కౌంట్
ఇందులో 2.5% తక్షణ డిస్కౌంట్ ఉంటుంది.
మిగతా 2.5% సామాజిక సేవా కార్యక్రమాలకు బహుమతిగా ఇస్తారు.
BSNL తీసుకువచ్చిన ఈ కొత్త ప్లాన్లు, ఆఫర్లు వినియోగదారులకు కచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా పెద్దవారికి “సమ్మాన్ ప్లాన్” మంచి ఆప్షన్.