అట్లుంటది బడ్జెట్ అంటే.. జస్ట్ రూ.25 వేల జీతం ఎక్స్ ట్రా వచ్చినందుకు.. వీళ్లకి రూ.63 వేల ట్యాక్స్..

మీ ఆదాయం ప్రకారం పన్నుల లెక్కలు ఎలా వేసుకోవాలో తెలుసా?

అట్లుంటది బడ్జెట్ అంటే.. జస్ట్ రూ.25 వేల జీతం ఎక్స్ ట్రా వచ్చినందుకు.. వీళ్లకి రూ.63 వేల ట్యాక్స్..

Updated On : February 1, 2025 / 5:32 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో 2025-2026 ఆదాయపన్ను స్లాబులు ఎలా ఉండనున్నాయన్న విషయంపై స్పష్టత వచ్చింది. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75,000గా ప్రకటించడంతో దీనిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.

ఉద్యోగి తనకు వచ్చే వార్షిక ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ జీతం సంవత్సరానికి రూ.12.75 లక్షలు అయితే స్టాండర్డ్ డిడక్షన్‌ (రూ.75,000)ను తొలగించాలి. దీంతో అది రూ.12 లక్షలు అవుతుంది.

అలాగే, రూ.12 లక్షల వరకు ఆదాయం ఉండే వారికి వేసే ట్యాక్స్‌కు సెక్షన్‌ 87ఏ ప్రకారం రిబేట్‌ మినహాయింపు ఉంటుంది. 2025-2026 కేంద్ర బడ్జెట్‌లో ఈ రిబేట్‌ రూ.60 వేలు. దీంతో రూ.12.75 లక్షల వార్షిక ఆదాయం సంపాదించే వారు కూడా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. అంతకు మించి సంపాదిస్తే మాత్రం పన్ను పడుతుంది.

Union Budget 2025 : చిన్నతరహా పరిశ్రమలకు వరాలు.. ఎంఎస్ఎంఈలకు బిగ్ రిలీఫ్.. స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారెంటీ రూ. 20 కోట్లకు పెంపు!

రూ.12.75 లక్షల వార్షిక ఆదాయం సంపాదించే వారు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకున్నాం.. మరి రూ.13 లక్షల వార్షిక ఆదాయం సంపాదించేవారు తమకు పడే పన్నును ఏ విధంగా లెక్కించాలో వివరింగా చూద్దాం..

న్యూ ట్యాక్స్ లెక్కించేది ఇలా..
మీ వార్షిక ఆదాయం రూ.13 లక్షలు అయితే.. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000గా నిర్మలా సీతారామన్ ప్రకటించారు కాబట్టి మీరు లెక్కించాల్సిన మొత్తం రూ.12,25,000.

రూ.0-4 లక్షల వరకు పన్ను సున్నా శాతం ఉంది. అంటే దీనికి మాత్రం మీపై పడే పన్ను సున్నా (ఏమీ ఉండదు).
రూ.4-8 లక్షల వరకు పన్ను 5 శాతంగా ఉంది. కాబట్టి రూ.20,000 పన్ను పడుతుంది.
రూ.8-12లక్షల వరకు పన్ను 10 శాతంగా ఉంది. కాబట్టి రూ.40,000 పన్ను పడుతుంది.
12-16 లక్షల వరకు పన్ను 15 శాతంగా ఉంది. అయితే, మీకు (మిగిలిన 25 వేలకు) రూ.3,750 పన్ను పడుతుంది.
దీంతో ఈపై పన్నులు అన్నింటినీ కూడితే మొత్తం కట్టాల్సిన పన్ను రూ.63,750.