Call of the Blue: నెక్టెస్ రోడ్‭లో యమహా ‘కాల్ ఆఫ్ ద బ్లూ’ ఫెస్టివ్.. పరుగులు పెట్టిన వందల బైకులు

ప్రతి మోటర్‌సైకిల్‌ అభిమానికి సవారీలోని ఆనందం ఆస్వాదించే అవకాశం లభించిందని నిర్వాహకులు అన్నారు. దీనితో పాటుగా యమహా ప్రీమియం మోడల్‌ శ్రేణిలో అత్యుత్తమ సాంకేతికత, పనితీరు, భద్రతా ఫీచర్లను సైతం తెలుసుకునే అవకాశం దొరికినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జింఖానా రైడ్‌ లాంటి కార్యక్రమాలనూ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న అభ్యర్ధులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా తమ సవారీ నైపుణ్యాలను సైతం మెరుగుపరుచుకునే అవకాశం కలిగింది

Call of the Blue: నెక్టెస్ రోడ్‭లో యమహా ‘కాల్ ఆఫ్ ద బ్లూ’ ఫెస్టివ్.. పరుగులు పెట్టిన వందల బైకులు

Call of the Blue Weekend event in Hyderabad

Updated On : January 24, 2023 / 8:08 PM IST

Call of the Blue: యమహా మోటర్‌ ఇండియా హైదరాబాద్‭లో తన మొదటి ‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ అనే వీకెండ్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది. ఈ ఏడాదికి సంబంధించి ఇదే మొదటి వీకెండ్ కార్యక్రమం కావడం గమనార్హం. కాగా, నగరంలోని నెక్లెస్‌ రోడ్‌‭లోని జలవిహార్‌ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1300 మంది యమహా అభిమానులు, బ్లూ స్ట్రీక్స్‌ నుంచి (యమహా యజమానులతో కూడిన కమ్యూనిటీ) 1000 కి పైగా రైడర్లు పాల్గొన్నారు.

Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో 3 వందేభారత్ రైళ్లు.. ఏయే రూట్లలో అంటే

ఈ కార్యక్రమం ద్వారా, ప్రతి మోటర్‌సైకిల్‌ అభిమానికి సవారీలోని ఆనందం ఆస్వాదించే అవకాశం లభించిందని నిర్వాహకులు అన్నారు. దీనితో పాటుగా యమహా ప్రీమియం మోడల్‌ శ్రేణిలో అత్యుత్తమ సాంకేతికత, పనితీరు, భద్రతా ఫీచర్లను సైతం తెలుసుకునే అవకాశం దొరికినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జింఖానా రైడ్‌ లాంటి కార్యక్రమాలనూ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న అభ్యర్ధులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా తమ సవారీ నైపుణ్యాలను సైతం మెరుగుపరుచుకునే అవకాశం కలిగింది. ఈ ఉత్సాహాన్ని మరింతగా నిర్మించేందుకు టెస్ట్‌ రైడ్‌ కార్యకలాపాలతో పాటుగా యమహా ఉత్పత్తి శ్రేణి, యాక్ససరీలు, అప్పెరల్స్‌ జోన్‌ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

Google Play Store : ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? గూగుల్ బ్లాక్ చేస్తుంది జాగ్రత్త.. ఎందుకో తెలుసా?

‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ వీకెండ్‌ యాక్టివిటీతో యమహా భారతదేశ వ్యాప్తంగా తమ ఉత్సాహపూరిత శ్రేణి, స్పోర్టీ మోడల్స్‌ను ప్రదర్శించనుంది. వీటిలో ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌–ఆర్‌15 వెర్షన్‌ 4.0 (155సీసీ); ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌ – ఆర్‌15ఎస్‌ వెర్షన్‌ 3.0 (155 సీసీ); ఏబీఎస్‌తో ఎంటీ–15 (155 సీసీ) వెర్షన్‌ 2.0 ; బ్లూ కోర్‌ టెక్నాలజీ ఆధారిత మోడల్స్‌ అయిన ఎఫ్‌జెడ్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఫేజర్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జడ్‌–ఎస్‌ ఎఫ్‌1 (149 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జెడ్‌–ఎఫ్‌1(14సీసీ) ఏబీఎస్‌తో; ఎఫ్‌జెడ్‌–ఎక్స్‌(149సీసీ) ఏబీఎస్‌తో, యుబీఎస్‌ ఆధారిత స్కూటర్లు అయిన ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), రేజెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ) ఉంటాయి.