కంప్లయింట్ ఫైల్ : మూవీ టికెట్లపై Paytm అదనపు ఛార్జీలు

ప్రముఖ ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం, మల్టిపెక్స్ ఐనాక్స్ సేవలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదైంది.

  • Published By: sreehari ,Published On : April 20, 2019 / 11:13 AM IST
కంప్లయింట్ ఫైల్ : మూవీ టికెట్లపై Paytm అదనపు ఛార్జీలు

Updated On : April 20, 2019 / 11:13 AM IST

ప్రముఖ ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం, మల్టిపెక్స్ ఐనాక్స్ సేవలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదైంది.

ప్రముఖ ఆన్ లైన్ డిజిటల్ పేమెంట్స్ సంస్థ Paytm, మల్టిపెక్స్ Inox మూవీ టికెట్ బుకింగ్ ఛార్జీలకు సంబంధించి  సైబర్ క్రైం బ్రాంచ్ లో ఫిర్యాదు నమోదైంది. కస్టమర్ల నుంచి అక్రమంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ సామాజిక కార్యకర్త ఒకరు పేటీఎం, ఐనాక్స్ మల్టిపెక్స్ పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజర్వ్ బ్యాంకు ఇండియా ధ్రువీకరణ లేకుండా కస్టమర్ల నుంచి అధిక మొత్తంలో ట్రాన్ జక్షన్స్ సర్వసు ఛార్జీలు వేస్తున్నారంటూ తన ఫిర్యాదులో తెలిపారు.

సరైన ధ్రువీకరణ లేకుండా వినియోగదారుల ఆన్ లైన్ లావాదేవీలపై పేమెంట్ gateway fee ఛార్జ్ చేయడం చట్టవిరుద్ధమని, అవినీతి వ్యతిరేక ఫారం అధ్యక్షుడు విజయ్ గోపాల్ ఆరోపించారు. movie tickets బుకింగ్ చేసుకున్న కస్టమర్ల నుంచి అదనంగా ఛార్జ్ చేస్తున్నట్టు గోపాల్ ఆరోపించారు. 
Also Read : ఇంటర్ బోర్డు లీలలు : ఫస్టియర్‌లో జిల్లా టాపర్, సెకండియర్‌లో తెలుగులో ఫెయిల్

బుకింగ్ ఛార్జీలు, టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల పేరుతో అసలు టికెట్ ధర కంటే 30 శాతానికి పైగా అదనంగా ఫీజు ఛార్జ్ చేస్తున్నారని ఆరోపించారు. పేటీఎం ద్వారా మూవీ టికెట్ బుక్ చేసుకున్న తనకు కలిగిన అనుభవాన్ని ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ‘ఐనాక్స్ మల్టిపెక్స్ లెయిస్యూర్ లిమిటెడ్ లో రెండు మూవీ టికెట్లు బుక్ చేసుకున్నాను. రెండు టికెట్ల (ఒక్కో టికెట్ ధర రూ.138) కు కలిపి మొత్తం అసలు ధర రూ.276. పేమెంట్ సమయంలో క్యాన్సిలేషన్ ఛార్జీల కింద రూ.80.12 ఛార్జ్ చేశారు. 

అందులో క్యాన్సిలేషన్ ప్రొటక్షన్ ఛార్జీ రూ.33.9 కూడా యాడ్ అయ్యాయి. కన్వీనియన్స్ ఛార్జీ రూ.12, బుకింగ్ ఛార్జీ రూ.22 వరకు ఛార్జ్ చేశారు. మొత్తం (జీఎస్టీతో కలిపి) రూ.356.12 చెల్లించాను’ అని తన ఫిర్యాదులో గోపాల్ వివరించారు.  IT Act 2016 ప్రకారం.. సర్వీసు ఛార్జీల పేరుతో కస్టమర్ల నుంచి అదనంగా ఛార్జీలు మోపరాదు.  

డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు పేటీఎం, బుక్ మై షో సహి ఇతర సర్వీసు ప్రొవైడర్లు సెక్షన్ 6A(3) ఐటీ యాక్ట్ ప్రకారం.. వినియోగదారుల నుంచి అదనంగా Service Charge చేసే అనుమతి లేదని గోపాల్ అన్నారు. సర్వీసు ప్రొవైడర్లు కస్టమర్లపై సర్వీసు ఛార్జ్ వేయాలంటే.. ముందుగా ప్రభుత్వ అధికార సంస్థల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇటీవల Bookmy Show, PVR మల్టిఫెక్స్ లపై Consumer కోర్టులో గోపాల్ దావా వేశారు. పేటీఎం, ఐనాక్స్ మల్టిఫెక్స్ లు ఇంటర్నెట్ హ్యాండలింగ్ ఫీ ఛార్జీలపై గోపాల్ ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.

INOX మల్టిపెక్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. పేటీఎం ఛార్జీలకు సంబంధించి తమ కంపెనీతో కనెక్టవిటీ లేదని, దీనిపై పీటీఎం వారే స్పందించాల్సి ఉంటుందని అన్నారు. విజయ్ గోపాల్ ఫిర్యాదుతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అదనపు సర్వీసు ఛార్జీలపై గోపాల్ చేసిన ఫిర్యాదుపై Paytm ఇప్పటివరకూ స్పందించలేదు. 
Also Read : పీజీ చేయకుండా రాహుల్ ఎంఫిల్ ఎలా చేస్తారు : జీవీఎల్ క్వశ్చన్స్