విడాకులు తీసుకున్నవారే టార్గెట్ : పెళ్లి ట్రాప్ లో 25మంది..

  • Published By: Mahesh ,Published On : December 25, 2018 / 06:47 AM IST
విడాకులు తీసుకున్నవారే టార్గెట్ : పెళ్లి ట్రాప్ లో 25మంది..

పెళ్లి వెబ్ సైట్ ఓపెన్ చేయటం..పెద్ద మీడియా సంస్థను అధినేతనంటు కబుర్లు..పెండ్లి చేసుకుంటానంటు తియ్యని కబుర్లు..జీవితంలో దగా పడినవారికి కొత్త జీవితాన్నిస్తానంటు ఆదర్శాల ముచ్చట్లు చెప్పి యువతులను మోసం చేస్తున్న ఓ మోసగాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హరియాణాకు చెందిన అభిషేక్ వశిష్ట్ ఉరఫ్ అభినవ్ అభిరుద్రాంశ్‌ ప్రధానంగా విడాకులు తీసుకున్న యువతులను టార్గెట్ చేస్తుంటాడు. పెళ్లి వెబ్ సైట్లలో తనను తాను ఓ మీడియా సంస్థ యజమానిగా పరిచయం చేసుకుంటాడు. తియ్యటి మాటలు కలుపుతూ పెళ్లి చేసుకుందామని లొంగదీసుకుంటాడు.  తన కోరిక తీరగానే అడ్రస్ లేకుండా చెక్కేస్తాడు దర్జాగా..
ఐదుగురిని పెళ్లి చేసుకున్న ఓ మోసగాడు..మరో 21 మంది యువతులను వివాహం చేసుకుంటానని ట్రాప్ చేశాడు. కానీ ఎంతటి తెలివి వున్నవాడైనా మోసాలు ఎక్కవు కాలం చెల్లవు కదా..పాపం పడింది..ఈ ప్రబుద్ధుడి చేతిలో  మోసపోయిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అభిషేక్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు హరిద్వార్ లో అతడిని పట్టుకున్నారు. అనంతరం కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.