సినిమా డైలాగ్ కాదు.. సీఎం మాటలు : చంపినోడిని కాల్చిపారేయండి

  • Published By: Mahesh ,Published On : December 25, 2018 / 06:49 AM IST
సినిమా డైలాగ్ కాదు.. సీఎం మాటలు : చంపినోడిని కాల్చిపారేయండి

కనిపిస్తే కనికరం లేకుండా కాల్చి పారేయండీ.. ఏం ఆలోచించొద్దు.. అలా కాల్చిపారేస్తేనే మిగతా వాళ్లకు భయం, భక్తి ఉంటాయి.. ఈ మాటలు సినిమాలోని డైలాగ్స్ కాదు కర్ణాటక సీఎం కుమారస్వామి పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు. ఆయన పోలీసులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. సీఎం కుమారస్వామి మాటలను లోకల్ రిపోర్టర్ కెమెరాలో రికార్డు అయ్యింది. అంతే దుమ్ముదుమారం అయ్యింది. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. విమర్శలు ఎక్కువ కావటంతో.. సీఎం కుమారస్వామి వెనక్కి తగ్గారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం మాట మార్చారు. కోపంలో అలా అన్నాను కానీ.. నిజం అలా చేస్తారా ఏంటీ అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. సీఎంగా అధికారిక ఆదేశాలివ్వలేదని వివరణ ఇచ్చారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జనతాదళ్‌ (ఎస్)కు చెందిన ఓ కార్యకర్త హత్యకు గురయ్యారు. హొణ్నలగెరె ప్రకాష్ డిసెంబర్ 24 సాయంత్రం కారులో వెళ్తుండగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెంబడించారు. వాళ్లు ప్రకాష్ వాహనాన్ని మద్దూర్‌ దగ్గర అడ్డుకుని కారులోంచి కిందికి దింపు.. దాడికి పాల్పడ్డారు. ప్రకాశ్ చనిపోయారు. హత్యకు కారకులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు.. రెండు హత్య కేసుల్లో నిందితులు. బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. దాడిలో ప్రకాష్ చనిపోయిన విషయం తెలుసుకున్న సీఎం కుమారస్వామి.. ఫోన్ లో పోలీసులతో మాట్లాడుతూ దోషులను కనికరం లేకుండా కాల్సి పడేయండి అంటూ చెప్పారు. ఆ సిట్యువేషన్ లో మాట్లాడినదే ఈ వీడియో.