TDR Lands : టీడీఆర్‌తో ఎన్నో ఉపయోగాలు.. టీడీఆర్‌ను తెరపైకి తెచ్చిన సర్కార్‌

గ్రామకంఠం భూములకు 200 శాతం... రిజిస్ట్రేషన్‌ భూమికి 400 శాతం టీడీఆర్‌ రూపంలో భూమికి పరిహారంగా ఇస్తారు. సర్టిఫికెట్ రూపంలో ఉండే ఈ విలువను అమ్ముకునేందుకు అవకాశం ఉంది.

TDR Lands : టీడీఆర్‌తో ఎన్నో ఉపయోగాలు.. టీడీఆర్‌ను తెరపైకి తెచ్చిన సర్కార్‌

Dream Home : Benefits With TDR Lands in Hyderabad City

TDR Lands : హైదరాబాద్‌ నగరంతో పాటు పలు పట్టణాల్లో అభివృద్ధి పనులకు భూ సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం కంటే ఎక్కువ నిధులు భూసేకరణకు అవసరమవుతాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా చెరువు, నాలా, రోడ్డు, ఇతర డెవలప్‌మెంట్‌ పనులు చేపడుతున్నప్పుడు సేకరించే భూములకు డబ్బులకు బదులు ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్‌ రైట్స్- టీడీఆర్‌ను జారీ చేస్తున్నాయి స్థానిక సంస్థలు.

Read Also : Dream Home : హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు.. సొంత ఇల్లుకు రూ. కోటి కావాల్సిందే..!

నిర్మాణదారులకు వరంగా టీడీఆర్‌ :
మార్కెట్ ధరకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు రెట్ల వరకు ఈ టీడీఆర్‌లు ఉంటున్నాయి. గ్రామకంఠం భూములకు 200 శాతం… రిజిస్ట్రేషన్‌ భూమికి 400 శాతం టీడీఆర్‌ రూపంలో భూమికి పరిహారంగా ఇస్తారు. సర్టిఫికెట్ రూపంలో ఉండే ఈ విలువను అమ్ముకునేందుకు అవకాశం ఉంది. టీడీఆర్‌ ఉంటే నిర్మాణదారులు ఒక అంతస్తు ఎక్కువగా నిర్మించుకునేందుకు వీలుంటుంది. ఇది రియాల్టర్లకు ఎంతో మేలు చేసే అంశమని రియాల్టీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్ రంగానికి మరింత మేలు :
ఇక న‌గ‌రంలో ట్రాఫిక్ క‌ష్టాల‌ను తీర్చేందుకు పలు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను జీహెచ్‌ఎంసీ పూర్తి చేసింది. ఇవే కాకుండా మ‌రికొన్ని చోట్ల రోడ్ల విస్తర‌ణ‌, నాలా డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల‌ను చేప‌డుతోంది. కొన్ని చోట్ల చెరువుల అభివృద్ధి పనులను చేపడుతోంది. అయితే వీట‌న్నింటికి భూ సేక‌ర‌ణ చేయ‌డం అధికారుల‌కు స‌వాల్‌గా మారింది. దీంతో టీడీఆర్‌ను విరివిగా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. టీడీఆర్‌ బ్యాంక్‌పై పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉండేలా జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Read Also : HMDA Focus : కొత్త లే-అవుట్ల రూపకల్పనపై హెచ్‌ఎండీఏ ఫోకస్!