GST Rate Cut : కస్టమర్లకు పండగే పండగ.. జీఎస్టీ తగ్గింపుతో చౌకగా మారిన కొత్త ఏసీలు, డిష్‌వాషర్లు.. కొత్త ధరల ఫుల్ లిస్ట్ ఇదిగో..!
GST Rate Cut : ఈ పండుగ సీజన్‌లో రూమ్ ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్ల ధరలు భారీగా తగ్గాయి. సోమవారం నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి.

Festive season boost
GST Rate Cut : అసలే పండగ సీజన్.. కొత్త ఏసీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. అందులోనూ జీఎస్టీ కొత్త రేట్లు కూడా అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ రేట్లు తగ్గింపుతో కొత్త ఏసీలు, డిష్ వాషర్ల ధరలు భారీగా దిగొచ్చాయి. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆసక్తిగల వినియోగదారులు ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్లు వంటి అప్లియన్సెస్ చౌకైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
ప్రముఖ బ్రాండ్లు ఏసీలపై రూ.4,500, డిష్‌వాషర్లపై రూ.8వేల వరకు ధరలను తగ్గించాయి, జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల పన్నును 28శాతం నుంచి 18శాతానికి తగ్గించడంతో ఏసీలు, డిష్ వాషర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గాయి. ఈ వారమే నవరాత్ర పండుగ సీజన్ ప్రారంభం కావడంతో కొనుగోలుదారులు డీల్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఏసీలపై భారీ తగ్గింపు, మరెన్నో ఆప్షన్లు :
వోల్టాస్, డైకిన్, ఎల్జీ, పానసోనిక్, హైయర్, గోద్రేజ్ అప్లయెన్సెస్ వంటి టాప్ రేంజ్ కంపెనీలు కొత్త ధరల జాబితాను విడుదల చేశాయి. గతంలో రూ.73,800గా ఉన్న డైకిన్ పాపులర్ 1.5-టన్ 5-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర ఇప్పుడు రూ.68,020గా ఉంది. ఎల్జీ ఎంట్రీ-లెవల్ 1-టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ.32,890కి తగ్గించగా, వోల్టాస్ ఇన్వర్టర్ విండో ఏసీని రూ.46,990 నుంచి రూ.43,290కి తగ్గించింది.
గోద్రేజ్ కమర్షియల్ విభాగంలో అత్యధిక తగ్గింపు అందిస్తోంది. క్యాసెట్, టవర్ ఏసీలపై రూ.8,550 నుంచి రూ.12,450 మధ్య తగ్గింపును అందిస్తోంది. హైయర్ గ్రావిటీ 1.6-టన్ ఇన్వర్టర్ ఏసీ ఇప్పుడు దాదాపు రూ.4వేలు తగ్గింపుతో రూ.46,085కి రిటైల్ అవుతుంది.
గోద్రేజ్ అప్లయన్స్ క్యాసెట్ టవర్ ఏసీలపై ఎంఆర్పీ ధరలను రూ.8,550 నుంచి రూ.12,450 వరకు తగ్గిస్తోంది. స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్‌పై ఎంఆర్పీ ధరలపై తగ్గింపు రూ.3,200 నుంచి రూ.5,900 వరకు ఉంది. హైయర్ గ్రావిటీ (1.6 టన్ ఇన్వర్టర్) ఏసీ ఎంఆర్పీని రూ.3,905 తగ్గించి రూ.46,085కి అందించనుంది. కినౌచి ఏఐ (1.5 టన్ను 4 స్టార్) ఏసీ ఎంఆర్పీ ధర రూ.3,202కి తగ్గించింది.
ఈ నెల ప్రారంభంలో జీఎస్టీ కౌన్సిల్ ఎయిర్ కండిషనర్లు, డిష్‌వాషర్లపై సుంకాన్ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ప్రముఖ ఆర్ఏసీ తయారీ సంస్థ వోల్టాస్ ఫిక్స్‌డ్ స్పీడ్ విండో ఏసీ ఎంఆర్పీని రూ.42,990 నుంచి రూ.39,590కి తగ్గించింది. ఇన్వర్టర్ విండో ఏసీ ఎంఆర్పీన రూ.46,990 నుంచి రూ.43,290కి తగ్గించింది. డైకిన్ 1 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఎంఆర్పీ రూ.20,500 నుంచి రూ.18,890కి తగ్గించింది.
1.5-టన్ 5-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ.73,800 ఉండగా, రూ.68,020కి తగ్గించారు 1.8-టన్ 5-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర రూ.92,200 నుంచి రూ.84,980కి తగ్గించారు. డైకిన్ 1.0 టన్ 3-స్టార్ హాట్, కోల్డ్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఎంఆర్పీ ధర రూ.50,700 నుంచి రూ.46,730కి తగ్గించింది. 1.5-టన్ 3-స్టార్ హాట్, కోల్డ్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ.61,300 నుంచి రూ.56,500కి తగ్గించింది.
ACs, dishwashers cheaperఎల్‌జీ ఎలక్ట్రానిక్ ఎంట్రీ లెవల్ 1 టన్ 3-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధరలను రూ.32,890కి తగ్గించింది. రూ.2,800 జీఎస్టీ ప్రయోజనం లభిస్తుంది. ఎల్‌జీ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ఎంఆర్పీ 3,600 తగ్గి రూ.42,390కి చేరుకుంది. 2 టన్ స్ప్లిట్ ఏసీ ధరలను రూ.4,400 తగ్గించి రూ.55,490కి చేరుకుంది. పానాసోనిక్ ఇండియా 1.5-టన్ విండో ఏసీ ధరలను రూ.42వేల నుంచి ప్రారంభమై రూ.46వేల వరకు తగ్గించింది.
ఈ ఏసీల ఎంఆర్పీ ధరలు సోమవారం నుంచి వరుసగా రూ.45,650, రూ.49,990 నుంచి అందుబాటులో ఉంటాయి. ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ (1.0 టన్) ధరలు రూ.42,400 నుంచి ప్రారంభమై రూ.63,900 (2.0 టన్నుకు) ధరలు వరుసగా రూ.46,100, రూ.69,400 నుంచి తగ్గుతాయి.
GST Rate Cut : డిష్ వాషర్లు మరింత చౌకగా :
డిష్‌వాషర్ తయారీదారులు కూడా కొనుగోళ్ల డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. డిష్ వాషర్ ధరలు తగ్గడంతో ఎక్కువ మంది కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. బీఎస్‌హెచ్ హోమ్ అప్లయెన్సెస్ అన్ని మోడళ్ల ధరలను తగ్గించింది. ఎంట్రీ-లెవల్ మెషీన్లు ఇప్పుడు రూ.45వేల నుంచి ప్రారంభమవుతాయి. హై-ఎండ్ డిష్‌వాషర్లు రూ.8వేలు తగ్గి రూ.96,500కి చేరుకున్నాయి.
డిష్‌వాషర్ తయారీదారులు కూడా ధరలను భారీగా తగ్గించారు. వినియోగదారులకు జీఎస్టీ ప్రయోజనాలను అందిస్తున్నారు. ప్రధానంగా పట్టణ యూజర్లకు ఈ కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. డిష్‌వాషర్ కేటగిరీలో ప్రముఖ తయారీదారు BSH గృహోపకరణాలు, జీఎస్టీ తగ్గింపు తర్వాత ధరలను రూ.8వేల వరకు తగ్గించాయి.
సెప్టెంబర్ 22 నుంచి ఎంట్రీ-లెవల్ డిష్ వాషర్ మోడల్ ధర రూ.49వేల నుంచి రూ.45వేలకు లభించనుంది. ఇందులో టాప్-ఎండ్ మోడల్ ధర రూ.8వేలు తగ్గింది. ఈ మోడల్ ధర రూ.104,500 నుంచి రూ.96,500 తగ్గింది. టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్, టర్కిష్ సంస్థ అర్సెలిక్ మధ్య జాయింట్ వెంచర్ వోల్టాస్ బెకో కూడా డిష్ వాషర్ల ధరలను భారీగా తగ్గించింది.
ఎంట్రీ లెవల్ డిష్ వాషర్ ధరలు రూ.25,990 నుంచి రూ.23,390కి తగ్గాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే తగ్గిన ఏసీలు, డిష్ వాషర్ ధరలకు ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించాయి. ధరల తగ్గింపుతో ఆసక్తిగల వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేస్తారని భావిస్తున్నారు.