ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే : భారీ ఆఫర్స్

ఢిల్లీ : ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ కష్టమర్స్ కు ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా భారీ ఆఫర్స్ ను ప్రకటించింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక సేల్ ను నిర్వహించనుంది. ఈ క్రమంలో జనవరి 20 నుండి 22 వరకు భారీ డిస్కౌంట్ లతో ఈ సేల్ ను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీగా ఆఫర్స్ ఇస్తోంది. ప్రతీ ఐటెమ్ ఆర్డర్ పై ఎస్బీఐ కార్డులతో క్యాష్ ట్రాన్షక్షన్ చేస్తే..అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ అందించనుంది. 75 శాతం వరకు టీవీ, అప్లయెన్సెస్ ఐటెమ్స్ పై భారీ డిస్కౌంట్ లభించనుంది. 80 శాతం వరకు ఎలక్ట్రానిక్, యాక్ససరీ వస్తువులపై డిస్కౌంట్ లభించనుంది. ఇంకేముంది ఈ రిపబ్లిక్ డే సందర్భంగా దేశ పండుగతోపాటు ఇంటి పండుగను కూడా చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్ ను ఉపయోగించుకోండి.