ఎయిరిండియాకి మరో గట్టి షాక్

భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో కష్టం వచ్చి పడింది. ఇంధన సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించని కారణంగా దేశంలోని 6 ప్రధాన ఎయిర్ పోర్టులకు

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 04:46 AM IST
ఎయిరిండియాకి మరో గట్టి షాక్

Updated On : August 23, 2019 / 4:46 AM IST

భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో కష్టం వచ్చి పడింది. ఇంధన సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించని కారణంగా దేశంలోని 6 ప్రధాన ఎయిర్ పోర్టులకు

భారత విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో కష్టం వచ్చి పడింది. ఇంధన సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించని కారణంగా దేశంలోని 6 ప్రధాన ఎయిర్ పోర్టులకు ఇంధనం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీఎస్) ప్రకటించాయి. ఈ నిర్ణయంతో విశాఖతోపాటు రాంచీ, మొహాలీ, పట్నా, పుణె, కొచ్చి ఎయిర్‌పోర్టులకు గురువారం(ఆగస్టు 22,2019) సాయంత్రం నుంచి ఫ్యూయల్ సప్లయ్ నిలిచిపోయింది. సమస్యని పరిష్కరించుకునేందుకు ఆయిల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు ఎయిరిండియా అధికారులు తెలిపారు. బకాయిల నిమిత్తం ఎయిరిండియా ఇప్పటికే రూ.60 కోట్లు చెల్లించినట్టు చెప్పారు.

ఇంధనం ఆపేసినా విమాన సర్వీసులు యథాతథంగా నడుస్తున్నాయని, వీటిపై ఎలాంటి ప్రభావం పడలేదని ఎయిరిండియా వెల్లడించింది. కాగా రుణాలు పెరిగి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంస్థను వెంటనే కేంద్రం ఆదుకోవాలని ఎయిరిండియా వర్గాలు కోరుతున్నాయి. కంపెనీ ఆర్థిక స్థితిగతులు, పనితీరు ఆశాజనకంగా ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదని వాపోయాయి.