భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు.. ఇండియాలో పెరిగిపోనున్న వీటి ధరలు
ఇప్పుడు అవి దిగుమతి కాకపోతే దేశంలో వాటి ధరలు కూడా పెరగవచ్చు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్ – భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు భారత్ గట్టిగా సమాధానం చెప్పాలని భావిస్తుండడం, సరిహద్దుల్లో పాక్ సైన్యం అలెర్ట్‌గా ఉండడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
ఇప్పటికే పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన చర్యలు తీసుకుంటోంది. సింధూ జలాల ఒప్పందం, పాకిస్థాన్ పౌరులకు సార్క్ వీసాలను రద్దు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ పరిస్థితుల్లో భారత్ – పాకిస్థాన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య అన్ని రకాల బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇది మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.
Also Read: ఐపీఎల్‌లో ఒక్కొ మ్యాచ్‌కు అంపైర్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?
పాకిస్థాన్ నుంచి భారత్ పలు రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వాటిపై ప్రభావం పడనుండడంతో వాటి ధరలు పెరిగిపోనున్నాయి.
ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, రాక్ సాల్ట్, అప్టికల్ లెన్సెస్, సిమెంట్, ముల్తానీ మిట్టి, కాటన్, స్టీల్, లెథర్ వస్తువుల వంటివాటి ధరలు పెరిగిపోతాయి.
డ్రై ఫ్రూట్స్: భారత్ డ్రై ఫ్రూట్స్‌ను ఎగుమతి చేసే ప్రధాన దేశం పాకిస్థాన్. ఇప్పడు వాటిపై ప్రభావం పడుతుండడంతో వాటి ధరలు పెరుగుతాయి.
రాక్ సాల్ట్: భారత్‌కు రాక్ సాల్ట్ అత్యధిక శాతం పాకిస్థాన్ నుంచే వస్తుంది. వాణిజ్యం నిలిపివేస్తుండడంతో వాటి ధరలు బాగా పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆప్టికల్ లెన్స్‌లు: పాకిస్థాన్‌లో తయారయ్యే కళ్లద్దాల్లో కొన్నింటికి భారత్‌లో డిమాండ్ ఉంది. ఇప్పుడు అవి దిగుమతి కాకపోతే దేశంలో ఆప్టికల్ లెన్స్‌ల ధరలు కూడా పెరగవచ్చు.