Garmin Fenix 8 Series : అథ్లెట్ల కోసం గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

ప్రీమియం స్మార్ట్‌వాచ్ బ్రాండ్ గార్మిన్ ఫెనిక్స్ ​​8 సిరీస్ వచ్చేసింది. ఈ కొత్త వాచ్ సిరీస్‌తో పాటు, ఫిట్‌నెస్ కోచ్‌లు, అథ్లెట్లను లక్ష్యంగా చేసుకుని పర్సనలైజడ్ యాప్ అప్లికేషన్‌ కూడా ప్రకటించింది.

Garmin Fenix 8 Series : అథ్లెట్ల కోసం గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

Garmin Fenix 8 Series launched in India

Updated On : October 23, 2024 / 8:07 PM IST

Garmin Fenix 8 Series Launch : కొత్త స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? ఫిట్‌నెస్, అడ్వెంచర్ ఔత్సాహికుల కోసం భారత మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. ప్రీమియం స్మార్ట్‌వాచ్ బ్రాండ్ గార్మిన్, కొత్త ఫెనిక్స్ ​​8 సిరీస్‌ను లాంచ్ చేసింది. తద్వారా గార్మిన్ భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.

అమోల్డ్, సోలార్ ఆప్షన్లతో రెండింటిలోనూ ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. వివిధ డిస్‌ప్లే సైజులలో వస్తుంది. ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో రూ. 86,990 నుంచి అమ్మకానికి ఉంది. కొత్త వాచ్ సిరీస్‌తో పాటు, ఫిట్‌నెస్ కోచ్‌లు, అథ్లెట్లను లక్ష్యంగా చేసుకుని పర్సనలైజడ్ యాప్ అప్లికేషన్‌ను కూడా గార్మిన్ ప్రకటించింది.

గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ ఫీచర్లు :
గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ ఫిట్‌నెస్, అడ్వెంచర్ ఔత్సాహికులకు రెండు డిస్‌ప్లే ఆప్షన్లను అందిస్తోంది. ప్రకాశవంతమైన అమోల్డ్ స్క్రీన్, సోలార్ ఛార్జింగ్ మోడల్ కలిగి ఉంది. అమోల్డ్ వెర్షన్ 3 సైజుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అందులో 43ఎమ్ఎమ్, 47ఎమ్ఎమ్, 51ఎమ్ఎమ్-సోలార్ మోడల్ 47ఎమ్ఎమ్, 51ఎమ్ఎమ్‌లలో వస్తుంది.

గార్మిన్ ఫెనిక్స్ 8 స్మార్ట్‌వాచ్ 51ఎమ్ఎమ్ అమోల్డ్ వేరియంట్ స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 29 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. సోలార్ మోడల్ 48 రోజుల వరకు పొడిగిస్తుంది. ఫెనిక్స్ ​​8 సిరీస్ థర్మల్, షాక్, వాటర్ ఎక్స్‌పోజర్‌కు మిలిటరీ-గ్రేడ్ నిరోధకతను కలిగి ఉంది. గార్మిన్ కొత్త ఫెనిక్స్ 8 సిరీస్‌కి సెన్సార్ గార్డ్‌ కూడా ఉంది. గడియారాల కీలకమైన భాగాలు, లీక్ ప్రూఫ్ మెటల్ బటన్‌లను ప్రొటెక్ట్ చేస్తుంది. తద్వారా ఎక్కువకాలం మన్నికను అందిస్తుంది.

ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం.. గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ బాడీ బ్యాటరీ స్కోర్‌లు, ట్రాక్ ఎండ్యూరెన్స్ లెవల్స్, హిల్ క్లైంబింగ్ ఎబిలిటీ, విఓ2 గరిష్టం, ట్రైనింగ్ స్టేటస్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఫిజికల్ పర్ఫార్మెన్స్‌పై ఇన్‌సైట్స్ అందిస్తుంది. ట్రయల్ రన్నింగ్, స్కీయింగ్, సర్ఫింగ్ వంటి విభాగాలకు స్పోర్ట్-నిర్దిష్ట వర్కౌట్‌లతో పాటు, 4-6 వారాల ప్రణాళికలతో అథ్లెట్ల కోసం రూపొందించిన ప్రత్యేకమైన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు కూడా ఈ సిరీస్‌లో ఉన్నాయి.

గార్మిన్ ఫెనిక్స్ 8 సిరీస్ ఇంటర్నల్ స్పీకర్, మైక్రోఫోన్‌తో కూడా వస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌తో పెయిర్ చేస్తే వాచ్ నుంచి నేరుగా కాల్స్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ యూజర్లను నోట్-టేకింగ్, అసిస్టెన్స్ ఫంక్షన్‌లతో సహా వాయిస్ కమాండ్‌లను ఎనేబుల్ చేసేందుకు అనుమతిస్తుంది. వీటిని ఆఫ్‌లైన్‌లో కూడా చేయవచ్చు.

సాహస యాత్రలో స్మార్ట్ వాచ్‌లో బ్రైట్‌నెస్ అడ్జెస్ట్ చేయగల ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ రెడ్ లైట్, స్ట్రోబ్ మోడ్‌తో వస్తుంది. సాహసికుల కోసం.. ఫెనిక్స్ 8 సిరీస్ 40-మీటర్ల వాటర్ ప్రూఫ్ డైవ్ సపోర్టు ఇస్తుంది. స్కూబా, అప్నియా డైవింగ్ కోసం ఫీచర్లను కలిగి ఉంటుంది. నావిగేషన్ కోసం ఫెనిక్స్ 8 సిరీస్ భూభాగ ఆకృతి, ప్రీలోడెడ్ గోల్ఫ్ కోర్సులు, స్కీ రిసార్ట్ మ్యాప్‌లతో కూడిన టోపోయాక్టివ్ మ్యాప్‌లను అందిస్తుంది.

గార్మిన్ ఫెనిక్స్ ​​8 సిరీస్ భారత్ ధర ఎంతంటే? :
భారతదేశంలో, గార్మిన్ తన ఫెనిక్స్ 8 సిరీస్‌ను రూ. 86990 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ సిరీస్ రెండేళ్ల వారంటీతో వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ప్రీమియం స్టోర్లు, గార్మిన్ ఇండియా వెబ్‌సైట్‌లో స్మార్ట్‌వాచ్‌ని పొందవచ్చు. కొత్త ఫెనిక్స్ ​​8 సిరీస్ విషయానికి వస్తే.. మీరు అథ్లెట్ అయినా లేదా ఎవరైనా అయినా… ఈ స్మార్ట్‌వాచ్ మరంత యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఈ కొత్త సిరీస్ అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లు, ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Read Also : Top Range 5 Cars : స్విఫ్ట్ నుంచి క్రెటా, థార్ రోక్స్ వరకు.. 2024లో ఎంట్రీ ఇచ్చిన టాప్ రేంజ్ 5 కార్లు ఇవే.. ఏ మోడల్ ధర ఎంతంటే?