Gautam Adani: ప్రపంచంలోని టాప్-20 ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి ప్రపంచంలోని టాప్ 20 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Adhani
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి ప్రపంచంలోని టాప్ 20 ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆసియాలో మూడవ ధనవంతుడైన గౌతమ్ అదానీ, ప్రపంచ కుభేరుల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం, అదాని ప్రపంచంలో 20వ ధనవంతుడుగా నిలిచారు. గత కొన్ని రోజులుగా అతని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగిన తర్వాత మొత్తం నికర ఆస్తి విలువ $60 బిలియన్ డాలర్లకు పెరిగింది.నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డిఎల్) నాలుగు ఎఫ్‌పీఐ ఖాతాలను స్తంభింపజేసిందని నివేదిక పేర్కొన్న తర్వాత, అతని నికర విలువ భారీగా పడిపోయింది.
భారతదేశంలో రెండవ ధనవంతుడు:
భారతీయ బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఛైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనవంతుడు కాగా.. అదాని సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు.
ఒకానొక సమయంలో అదానీ కంపెనీల షేర్ల ధరలు రోజుకు 4నుంచి 10శాతం పెరిగినప్పుడు, అదానీ, ముఖేష్ అంబానీని అధిగమించి భారతదేశపు అత్యంత ధనవంతుడుగా అవుతారని అనుకున్నారు.
ప్రపంచంలోని టాప్ 20 అత్యంత ధనవంతుల జాబితా:
ప్రపంచంలోని టాప్-20 ధనవంతుల జాబితాలో 13మంది అమెరికన్లు, ఇద్దరు ఫ్రెంచ్ వాళ్లు, ఇద్దరు భారతీయులు, ఒకరు చైనా వ్యక్తి, ఒక స్పానిష్ మరియు ఒక మెక్సికన్ అందులో ఉన్నారు. వారిలో ఇద్దరు మాత్రమే మహిళలు.
ఇటీవల ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి బిరుదును కోల్పోయిన అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్.. ఫోర్బ్స్ ద్వారా బిలియనీర్ల జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు.
ప్రపంచంలోని టాప్-20 ధనవంతుల జాబితా:
పేరు | నికర విలువ | దేశం |
జెఫ్ బెజోస్ | $ 191.3 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
ఎలన్ మస్క్ | $ 185.0 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
బెర్నార్డ్ ఆర్నాల్ట్ | $ 176.8 బిలియన్ | ఫ్రాన్స్ |
బిల్ గేట్స్ | $ 131.7 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
మార్క్ జుకర్‌బర్గ్ | $ 131.4 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
లారీ పేజీ | $ 121.3 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
సెర్గీ బ్రిన్ | $ 117.1 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
లారీ ఎల్లిసన్ | $ 115.4 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
వారెన్ బఫెట్ | $ 103.8 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
స్టీవ్ బాల్మెర్ | $ 96.9 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ | $ 90.9 బిలియన్ | ఫ్రాన్స్ |
ముఖేష్ అంబానీ | $ 84.1 బిలియన్ | భారతదేశం |
అమ్నెషియో వర్టేగా | $ 80.3 బిలియన్ | స్పెయిన్ |
కార్లోస్ స్లిమ్ హేలు & కుటుంబం | $ 77.4 బిలియన్ | మెక్సికో |
జిమ్ వాల్టన్ | $ 68.7 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
ఆలిస్ వాల్టన్ | $ 67.8 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
రాబ్ వాల్టన్ | $ 67.4 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
జాంగ్ షాన్షన్ | $ 65.8 బిలియన్ | చైనా |
ఫిల్ నైట్ & కుటుంబం | $ 61.4 బిలియన్ | అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
గౌతమ్ అదానీ | $ 60.0 బిలియన్ | భారతదేశం |