Gold Rates: రికార్డుల మోత మోగిస్తున్న బంగారం ధరలు.. రూ. లక్ష దాటింది.. ఇంకా పెరుగుతాయట..! కారణాలు ఇవే.. ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి రేట్లు ఇలా..
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ..

Gold Rates
Gold Rates: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతూ తాజాగా.. సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఇప్పటికే తులం గోల్డ్ రేటు రూ. లక్ష దాటగా.. వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: బంగారం రూ.3 లక్షలు.. ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే..!
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.280 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ పై రూ. 250 పెరిగింది. అయితే, గడిచిన నాలుగు రోజుల్లో 24క్యారట్ల గోల్డ్ పై సుమారు రూ. 4వేలు పెరుగుదల చోటు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఔన్సు గోల్డ్ పై 55 డాలర్లు పెరిగి.. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 3,433 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధరలు ఉన్నట్లుండి భారీగా పెరగడానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధమే కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకుతోడు అమెరికా డాలర్ క్షీణత, చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు ఇలానే కొనసాగితే కొద్దిరోజుల్లోనే తులం గోల్డ్ రేటు రూ. లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.93,200కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,680 చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,350కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,830కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.93,200 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,01,680కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,20,000 మార్క్ కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.