Gold Rate Today: అక్షయ తృతీయ సందర్భంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం..!

అక్షయ తృతీయ సందర్భంగా ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. ఎంత తగ్గిందో తెలుస్తే కొనుగోలుదారులు ఆశ్చర్య పోవటం ఖాయం.

Gold Rate Today: అక్షయ తృతీయ సందర్భంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం..!

Akshaya Tritiya 2025

Updated On : April 30, 2025 / 12:15 PM IST

Gold Rate Today: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ఇవాళ బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి స్వల్ప ఊరట. కొద్దిరోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ రికార్డు స్థాయిలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. గోల్డ్ రేటు తగ్గింది.

Gold

అక్షయ తృతీయ రోజు గోల్డ్ రేటు తగ్గింది. ఎంత తగ్గిందో తెలుస్తే ఆశ్చర్య పోవటం ఖాయం. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.60 తగగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 40తగ్గింది. మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది. బంగారం ధరలు మార్కెట్లో ప్రస్తుతం తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ బలపడటమే అని చెప్పవచ్చు. అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలకు దారితీస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే, వచ్చే వారం రోజుల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold

అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం గోల్డ్ రేటు తగ్గింది. బంగారం ఔన్సు (31.10గ్రాముల) ధర 16డాలర్లు తగ్గి బుధవారం 3,307 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్​ సిల్వర్​ ధర 32.79 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర తగ్గిన నేపథ్యంలో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఓ సారి తెలుసుకుందాం..

Gold

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.89,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,910 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,040కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 89,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.97,910కు చేరుకుంది.

Gold

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,09,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,09,000 వద్ద కొనసాగుతుంది.

Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.