Gold Rates: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, విజయవాడలో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర ..

Gold And Silver Price Today: ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రెండు రోజులుగా గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ వస్తుంది. దీంతో లక్షకు చేరువైన బంగారం ధర ప్రస్తుతం 90వేలకు పడిపోయింది.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో కలిపి 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.2800 తగ్గగా.. కిలో వెండి ధర రూ.8వేలు తగ్గింది. అయితే, ఏప్రిల్ చివరి నాటికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ (31.10 గ్రాముల) 3,037డాలర్ల వద్ద ట్రేడవుతుంది. గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.83,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,660 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,810 వద్ద కొనసాగుతుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 83,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ.90,660 గా నమోదైంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,03,000కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.94,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,03,000 వద్ద కొనసాగుతుంది.