Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతంటే?

బంగారం కొనుగోలు దారులకు శనివారం కాస్త ఊరట లభించింది. శుక్రవారంతో పోల్చితే గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల గోల్డ్ ధర ఎంతంటే?

Gold Rate

Updated On : October 14, 2023 / 3:13 PM IST

Gold and Silver Rate Today 14th October 2023: గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్న బంగారం ధరలు.. శనివారం కాస్త ఊరట కలిగించాయి. శుక్రవారంతో పోల్చితే గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బులియన్ మార్కెట్లో 10 క్యారెట్ల తులం బంగారం రూ. 54,000కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 58,910 వద్ద కొనసాగుతోంది. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి రూ. 1500 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 77వేలకు చేరింది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 54,000 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 58,910 వద్ద కొనసాగుతుంది.

Gold price

Gold price

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 59,060గా ఉంది.
– చెన్నైలో బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ పై రూ. 950 పెరుగుదల చోటుచేసుకోగా.. 24క్యారెట్ల బంగారంపై రూ. 1040 పెరిగింది. దీంతో చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,100 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,110 వద్దకు చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 54,000, కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,910 వద్ద కొనసాగుతుంది.

Gold

Gold

పెరిగిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై శనివారం రూ. 1500 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,000 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండి రూ.72,600 వద్దకు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ. 71,500గా ఉంది.

 

May be an image of text that says "హైదరబాద్‌లో ఇవాల్టి బంగారం ధరలు 101 గ్రామ్ 1 గ్రామ్ 8 గ్రామ్ 10 గ్రామ్ 100 గ్రామ్ 22 క్యారెట్‌ని ₹5,400 ₹43,200 ₹54,000 ₹5,40,000 22 క్యారెట్ 22క్యారెట్‌నేడు ₹5,400 ₹43,200 ₹54,000 ₹5,40,000 24 క్యారెట్ 24 క్యారెట్‌నేడు ₹5,891 ₹47,128 58,910 ₹5,89,100 గ్రామ్ 1 గ్రామ్ 8 గ్రామ్ 10 గ్రామ్ 100 గ్రామ్ 4క్యారెట్నిన్న ₹5,891 ₹47,128 ₹58,910 ₹5,89,100"