Gold Price Today: గోల్డ్ ప్రియులకు బిగ్ షాక్.. ఒకేసారి రూ. 1400 పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాములు బంగారంపై రూ.1400 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది.

Gold
Gold and Silver Rate Today 15th October 2023: బంగారం కొనుగోలు దారులకు బిక్ షాక్. ఆదివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ పై ఏకంగా రూ. 1400 పెరుగుదల చోటు చేసుకుంది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 1,530 పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55, 400కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,440కి చేరింది. మరోవైపు వెండి ధరలో ఆదివారం ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 77వేల వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వరుసగా పండుగలు ఉండటంతో పాటు పెళ్లిళ్లు ఉండటంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో బంగారం ధరలు భారీగా పెరగడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 55,400 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 60,440 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,550 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 60,590కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ పై రూ. 450, అదేవిధంగా 24క్యారెట్ల బంగారంపై రూ. 490 పెరిగింది. దీంతో చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,550 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,600 వద్దకు చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,400, కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,440 వద్ద కొనసాగుతుంది.

Gold
పెరిగిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,000 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతుంది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలలో కిలో వెండిపై రూ. 1500 పెరిగింది. దీంతో ఆ నగరాల్లో కిలో వెండి రూ.74,100 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ. 71,500గా ఉంది.