Gold Price Today : ఆహా.. పండుగకు ముందు బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతంటే..?
Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.

Gold Price Today
Gold Price Today : దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతుంటారు. అయితే, అలాంటి వారికి బంగారం ధరలు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి. కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న గోల్డ్ రేటు.. తాజాగా మరోసారి భారీగా పెరిగింది.
బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డాలర్ తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 820 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.750 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. అక్కడ ఔన్సు గోల్డ్ పై 41 డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 3685 డాలర్ల వద్దకు చేరింది.
వెండి ధరసైతం భారీగా పెరిగింది. శుక్రవారం కిలో వెండిపై రూ. 2వేలు పెరగ్గా.. శనివారం కూడా కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే కిలో వెండిపై రూ. 4వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,02,800 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,12,150కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,950 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,12,300కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,02,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,12,300కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,45,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,35,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,45,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.