Gold Rate Today : రాకెట్ స్పీడ్ లో గోల్డ్ రేట్.. ఆల్ టైమ్ హయ్యస్ట్ రికార్డు కూడా బ్రేక్.. తులం కొనాలంటే..
Gold Rate తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.

Gold Rate Today
Gold Rate All Time High : దసరా, దీపావళి పండుగల వేళ బంగారం, వెండి కొనుగోలు చేద్దామనుకునే వారికి బిగ్ షాకింగ్ న్యూస్. పండుగల వేళ పసిడి ధరలు (Gold Rate Today) పరుగులు పెడుతున్నాయి. వందలు కాదు.. ఏకంగా వేలల్లో రోజురోజుకు గోల్డ్ రేటు దూసుకెళ్తోంది. దీంతో గోల్డ్ రేటు ఆల్‌టైం రికార్డులను నమోదు చేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 3వేల డాలర్లు దాటితే దేశంలో బంగారం ధరలు మండిపోతుంటాయి. తాజాగా.. ఔన్సు గోల్డ్ ఏకంగా 4వేల డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం 3865 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ భయాలు, వడ్డీ రేటు తగ్గింపు అంచనాల కారణంగా సురక్షితమైన బంగారంకు డిమాండ్ పెరిగింది. దీంతో పుత్తడి రేటు ఆల్‌టైం రికార్డులు నమోదు చేస్తుంది. 2011 ఆగస్టు నెల తరువాత అంటే 14ఏళ్ల తరువాత బంగారం ధరలు భారీగా పెరిగిన నెలగా ఈ సెప్టెంబర్ నెల రికార్డుల్లోకి ఎక్కింది.
భారతదేశంలోనూ బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,420 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారం రేటు 1,300 పెరిగింది. దీంతో.. నాలుగు రోజుల్లోనే తులం బంగారంపై సుమారు రూ.3వేలు పెరిగింది. మరోవైపు వెండిర ధరసైతం దూసుకెళ్తోంది. ఇవాళ కిలో వెండిపై రూ.వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,08,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,18,310కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,600 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,18,460కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,08,450 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,18,310కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,61,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,51,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,61,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.