Gold Rates: శుభవార్త.. బంగారం ధరలు తగ్గుతాయా? అంతర్జాతీయంగా ఏం జరుగుతోందో తెలుసా?
బంగారం కొనాలని భావిస్తున్నారా? ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

అంతర్జాతీయంగా కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ ఉదయం నాటికి మాత్రం 2,910 డాలర్ల కంటే తక్కువకు చేరాయి. యూఎస్ యీల్డ్స్ పెరగడమే అందుకు కారణం. యూఎస్ యీల్డ్స్ అంటే ప్రభుత్వ బ్లాండ్లపై రిటర్న్స్. సమీప భవిష్యత్తులోనూ బంగారం ధరల కాస్త తగ్గవచ్చని తెలుస్తోంది. దీని ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశాలు ఉన్నాయి.
జియోపాలిటికల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా కొంత మేరకు బంగారం రేట్లు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. యూస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) ఫిబ్రవరి నాన్-ఫార్మ్ పేరోల్స్ (NFP) నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఆర్థిక వ్యవస్థ బాగుండడంతో జనవరిలో కంటే ఫిబ్రవరిలో అధిక మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. కానీ, నిపుణులు ఊహించిన దానికంటే తక్కువ ఉద్యోగాలు వచ్చాయి.
దీనిపై ఫెడరల్ రిజర్వ్ (Fed) గవర్నర్ ఆడ్రియానా కుగ్లర్ మాట్లాడుతూ.. అర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల ప్రతి ఒక్కరిపైనా ఈ ప్రభావం పడుతుందని తెలిపారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, ఆర్థిక విధానం కొంతకాలం స్థిరంగా ఉంటాయని చెప్పారు.
ఇటీవలే ఫెడ్ ఛైర్మన్ ‘జెరోమ్ పౌల్’ వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఫెడ్ తొందరపడదని మరోసారి స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణ లక్ష్యం 2% చేరుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని, ఒకటి లేదా రెండు డేటా రీడింగ్స్‌పై అధికంగా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హమాస్‌పై ఒత్తిడి పెంచుతూ బందీలను విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ విధంగా జియోపాలిటికల్ ఉద్రిక్తతలు తగ్గడం కొంత మేరకు బంగారం రేటు తగ్గుదలపై ప్రభావం చూపుతాయి.
కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) 2025 మొదటి రెండు నెలల్లో 10 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే, అత్యధిక కొనుగోలు చేసినది మాత్రం నేషనల్ బ్యాంక్ అఫ్ పోలాండ్ (NBP). ఇది 29 టన్నులు కొనుగోలు చేసింది. 2019 జూన్‌లో 95 టన్నులు కొనుగోలు చేసిన తర్వాత ఇదే అతిపెద్ద లావాదేవీ.
బంగారం మార్కెట్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయంటే?
- అమెరికాలో 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్ యీల్డ్ 4.318%కి మూడు బేసిస్ పాయింట్లు పెరిగింది. అంటే అమెరికాలో దిగుబడి పెరగడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలలో పెరుగుదల నెమ్మదిస్తుంది.
- అమెరికాలో 10-సంవత్సరాల ట్రెజరీ ఇన్ఫ్లేషన్-ప్రొటెక్టెడ్ సెక్యూరిటీస్ (TIPS) యీల్డ్ 1.981%కి పెరిగింది. అంటే
- ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వ బాండ్ల వంటి పెట్టుబడుల నుంచి మీరు ఎంత సంపాదిస్తారో దాన్నిబట్టి నిజమైన రాబడి చూపిస్తుంది. ఈ రాబడి కొద్దిగా పెరిగి 1.981%కి చేరుకుంది. రాబడి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా పెట్టుబడిదారులకు తక్కువ ఆకర్షణీయంగా మారుతుంది, బంగారం ధరలు తగ్గేలా ఒత్తిడి తెస్తుంది.
- ఫిబ్రవరి NFP నివేదిక 151000 ఉద్యోగాలను చూపింది. ఇది జనవరిలోని 125000 కంటే మెరుగైనదైనా, అంచనా వేసినట్లు 160000ని చేరుకోలేకపోయింది.
- నిరుద్యోగిత రేటు 4.1%కి పెరిగింది, ఇది అంచనా వేసిన 4.0% కంటే కొంచెం ఎక్కువ.
- అట్లాంటా ఫెడ్ GDPNow మోడల్ ప్రకారం, Q1 2025 GDP వృద్ధి -2.4%గా ఉండొచ్చు. ఇది గత రిపోర్టు -2.8% అంచనాతో పోల్చితే మెరుగుపడింది.