బంగారం ధర పెరిగింది.. బాస్

బంగారం ధర పెరిగింది.. బాస్

Updated On : November 29, 2019 / 4:56 AM IST

దేశీయ మార్కెట్లో బంగారం రేట్ మరోసారి పెరిగింది. అమెరికా-చైనా మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటం లాభాలు తెచ్చిపెడుతుంది. మూడేళ్లతో పోల్చి చూస్తే బంగారం ధర దేశీయ మార్కెట్లో ప్రస్తుత నెలలోనే అత్యంత దారుణంగా ఉంది. నవంబరు 28నాటికి 0.53శాతం అంటే రూ.198 పెరిగిన బంగారం ధర డిసెంబరు నెలకు రూ.37వేల 723కానుంది. రూపాయి విలువ పడిపోతుండటంతో బంగారం, వెండి ధరలు దేశీయ మార్కెట్లు నిలదొక్కుకుంటున్నాయి. 

నవంబరు 28నాటికి రూపాయి విలువ 27పైసలు పతనమై ఒక్క అమెరికా డాలరుకు 71.62రూపాయలకు చేరింది. నవంబరు 29కి బంగారం ధర పది గ్రాములకు రూ.37వేల 763చేరొచ్చని విశ్లేషకులు అంచనా. శుక్రవారం మార్కెట్ పూర్తయ్యేసరికి బంగారం రూ.37వేల 500నుంచి 37వేల 850వరకూ ఉండొచ్చని నిపుణుల అంచనా.

ఇండియానివేశ్ కమొడిటీస్ డైరక్టర్ మనోజ్ కుమార్ జైన్ ఈ విధంగా ట్రేడ్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ‘బంగారం రూ.37వేల 500, వెండి కేజీ రూ.43వేల 850ఉండొచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బంగారం రూ.37,500-37,850గా, వెండి రూ. 43,850-44,500మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.