భగ్గుమన్న బంగారం : అమాంతం పెరిగిన ధర

బంగారం ధరలు భగ్గుమన్నాయి. పసిడి ధర అమాంతం పెరిగింది. ఒక్క రోజే పది గ్రాముల బంగారం ధర రూ.225 పెరుగుదలతో 10 గ్రాముల ధర రూ.33,100కు చేరింది.

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 04:01 AM IST
భగ్గుమన్న బంగారం : అమాంతం పెరిగిన ధర

Updated On : January 15, 2019 / 4:01 AM IST

బంగారం ధరలు భగ్గుమన్నాయి. పసిడి ధర అమాంతం పెరిగింది. ఒక్క రోజే పది గ్రాముల బంగారం ధర రూ.225 పెరుగుదలతో 10 గ్రాముల ధర రూ.33,100కు చేరింది.

బంగారం ధరలు భగ్గుమన్నాయి. పసిడి ధర అమాంతం పెరిగింది. ఒక్క రోజే పది గ్రాముల బంగారం ధర రూ.225 పెరుగుదలతో 10 గ్రాముల ధర రూ.33,100కు చేరింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు ఇందుకు కారణం. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో 40వేల 100 రూపాయలకు పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 1,290.22 డాలర్లకు.. వెండి ధర ఔన్స్‌కు 15.73 డాలర్లకు పెరిగింది.

* 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర హైదరాబాద్‌లో 33 వేల 100 రూపాయలు
* 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రా. ధర 30 వేల 870 రూపాయలు
* 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర చెన్నైలో 32 వేల 350 రూపాయలు
* 24 క్యారెట్ల బంగారం 10 గ్రా. ధర 30 వేల 880 రూపాయలు
* వెండి కిలో ధర హైదరాబాద్‌లో 40 వేల 100 రూపాయలు
* చెన్నైలో 42 వేల 600 రూపాయలు
* ఢిల్లీలో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర 33వేల 100 రూపాయలు
* 22 క్యారెట్ల బంగారం ధర 32వేల 950 రూపాయలు