Gold Rates: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. వెంటనే కొన్నారనుకో..

హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇంతే ఉన్నాయి.

Gold Rates: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. వెంటనే కొన్నారనుకో..

Gold And Silver Price

Updated On : February 21, 2025 / 12:30 PM IST

బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. ఇవాళ ఉదయం 11 గంటల నాటికి పసిడి ధరలు తగ్గాయి. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.450 తగ్గింది.

దీంతో తులం బంగారం ధర రూ.80,250గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మాత్రం కాస్త పెరిగింది. రూ.60 పెరిగి తులం బంగారం ధర రూ.88,100గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇంతే ఉన్నాయి.

Also Read: గ్రూప్-1 మెయిన్స్‌ ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలుసా?

Gold

Gold

ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.550 తగ్గి రూ.80,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.640 తగ్గి రూ.87,550గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గింది.

ముంబైలో తులం బంగారం ధర రూ.80,250గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మాత్రం కొంత పెరిగింది. రూ.60 పెరిగి తులం బంగారం ధర రూ.88,100గా ఉంది.

దేశంలో వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 చొప్పున తగ్గింది.

ఏ నగరాల్లో ఎలా?

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,07,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,00,400గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.1,00,400గా ఉంది