Gold Silver Prices Today : బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయ్.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Rates Today : బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి రేటు భారీగా తగ్గింది.

బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. నేడు గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గాయి.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 12డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,159 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధర భారీగా తగ్గింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,46,620 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,34,400 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,770 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,620కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,34,400 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,50,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,40,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,50,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
