EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఏటీఎంల ద్వారా ఈపీఎఫ్‌వో సేవలు.. ఎప్పటినుంచంటే?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు శభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యంకోసం ఈపీఎఫ్‌వో సంస్థ ఈపీఎఫ్‌వో అకౌంట్లలో ..

EPFO
EPFO: ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు శభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యంకోసం ఈపీఎఫ్‌వో సంస్థ ఈపీఎఫ్‌వో అకౌంట్లలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఈపీఎఫ్‌వో క్లయిమ్, వివరాలను చేర్చడం, తొలగించడం, ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది. మరోవైపు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ ల ద్వారా ఈపీఎఫ్‌వో విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే, తాజాగా.. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్ లోని బేగంపేటలో ఈపీఎఫ్‌వో నూతన జోనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విషయాన్ని చెప్పారు. ఈపీఎఫ్‌వో డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేస్తామని, భవిష్యత్తులో ఏటీఎంల ద్వారా కూడా ఈపీఎఫ్‌వో సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే 201 టోల్ ఫ్రీ నెంబర్ ప్రారంభించామని చెప్పారు.
కార్మికుల సమస్యలను, క్లైయిమ్ లను త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ తీసుకోవాలని అధికారులకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ పనిచేసేవారైనా నేరుగా బ్యాంకుల నుంచే పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించాం. గతంలో చిన్నచిన్న ఆటంకాలు, సమస్యలు అనేకం ఉండేవి. వాటన్నింటినీ దశల వారీగా తొలగించామని చెప్పారు. రాబోయే కాలంలో ఈపీఎఫ్ వో డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేయడంతోపాటు.. ఏటీఎం ద్వారా కూడా ఈపీఎఫ్ వో సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.