Google Find My Device : ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ‘ఫైండ్ మై డివైజ్’ నెట్‌వర్క్.. పిక్సెల్ 8 ఫోన్లు ఆఫ్‌‌లో ఉన్నా ఈజీగా ట్రాక్ చేయొచ్చు!

Google Find My Device : ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ప్రధానంగా పిక్సెల్ 8 డివైజ్‌‌లను స్విచ్చాఫ్ చేసినప్పటికీ ఆయా డివైజ్‌లను ఈజీగా ట్రాక్ చేయొచ్చు.

Google Find My Device : ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ‘ఫైండ్ మై డివైజ్’ నెట్‌వర్క్.. పిక్సెల్ 8 ఫోన్లు ఆఫ్‌‌లో ఉన్నా ఈజీగా ట్రాక్ చేయొచ్చు!

Google Find My Device

Google Find My Device : మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కడైనా పొగొట్టుకున్నారా? మీ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినప్పటికీ కూడా సులభంగా ట్రాక్ చేయొచ్చు. ఇప్పటివరకూ ఆపిల్ యూజర్లు మాత్రమే ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌ని కలిగి ఉన్నారు. ఐఫోన్లు, ఎయిర్‌ప్యాడ్ వంటి మొదలైన పోగొట్టుకున్న ప్రొడక్టులను సులభంగా ట్రాక్ చేసే వీలుంది.

ఇప్పుడు, ప్రత్యేకించి ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ ట్రాకింగ్ ఫీచర్ గత ఏడాదిలోనే లాంచ్ కావాల్సి ఉంది. కానీ, సైబర్ నేరగాళ్లు ఈ ఫీచర్ దుర్వినియోగం చేస్తారనే కారణంగా ఆలస్యం అయింది. ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఫీచర్ నెట్‌వర్క్ ప్రారంభమైందని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది.

Read Also : Google Gmail Shutdown : ఆగస్టు 2024లో జీమెయిల్ పూర్తిగా నిలిచిపోనుందా? పుకార్లను నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చిన గూగుల్!

త్వరలో గ్లోబల్ యూజర్లకు అందుబాటులోకి :
గూగుల్ సరికొత్త ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌ను అమెరికా, కెనడాలో ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ డివైజ్‌లకు త్వరలో అందుబాటులోకి రానుంది. బిలియన్ కన్నా ఎక్కువ మంది ఆండ్రాయిడ్ డివైజ్‌లతో కూడిన కొత్త, క్రౌడ్‌సోర్స్డ్ నెట్‌వర్క్‌తో ఫైండ్ మై డివైజ్.. మీరు పొగొట్టుకున్న ఆండ్రాయిడ్ డివైజ్‌ను ట్రాక్ చేయడంలో సాయపడుతుంది.

ఫైండ్ మై డివైజ్ అనే ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ వారి ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, ట్రాకర్‌లను గుర్తించవచ్చు. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ విస్తరించనుంది.

ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు :
ఇప్పటికే ఉన్న ఫైండ్ మై డివైజ్ సెట్టింగ్‌ అనేది డివైజ్ ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. వై-ఫై లేదా సెల్యులార్ నెట్‌వర్క్‌ల నుంచి డిస్‌కనెక్ట్ అయిన డివైజ్‌లను గుర్తించడానికి కొత్త నెట్‌వర్క్ బ్లూటూత్‌ను ఉపయోగిస్తుంది. పవర్డ్ ఆఫ్ ఫైండింగ్ అని పిలిచే ఈ ఫీచర్.. డివైజ్ బ్లూటూత్ కంట్రోలర్ మెమరీలో బీకాన్‌లను స్టోర్ చేస్తుంది. సపోర్టు ఉన్న డివైజ్‌లను కనెక్ట్ చేయనప్పటికీ వాటిని గుర్తించడానికి నెట్‌వర్క్‌ని అనుమతిస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్‌లు పవర్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ లేదా బ్యాటరీ డెడ్ అయినప్పటికీ కూడా పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్‌లను ట్రాక్ చేయొచ్చు.

  • ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ డివైజ్‌లను గుర్తించగల 5 మార్గాలను గూగుల్ జాబితా చేసింది.
  • సపోర్టెడ్ ఆండ్రాయిడ్ డివైజ్‌లను రింగ్ చేయడం ద్వారా లేదా మ్యాప్‌లో వాటి లొకేషన్ ట్రాక్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ సులభంగా గుర్తించవచ్చు.
  • Chipolo, Pebblebee రూపొందించిన బ్లూటూత్ ట్రాకర్ ట్యాగ్‌ల ద్వారా కీ లేదా ఐటెమ్స్ వంటివి గుర్తించడానికి (Find My Device) యాప్‌ని ఉపయోగించాలి.
  • బ్లూటూత్ ట్యాగ్‌లను ఉపయోగించి వ్యాలెట్లు లేదా కీ వంటి సమీపంలోని వస్తువులను గుర్తించడానికి ‘Find Nearby’ బటన్‌ను ఉపయోగించాలి.
  • హోమ్ నెస్ట్ డివైజ్‌లకు సంబంధించి పొగొట్టుకున్న ఫోన్‌లు లేదా ఇతర వస్తువులను సులభంగా ట్రాక్ చేయొచ్చు.
  • యాప్ ద్వారా యాక్సెసరీని ఇతరులతో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ దాన్ని ట్రాక్ చేసేందుకు అనుమతిస్తుంది.

ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్ ఆండ్రాయిడ్ 9 వెర్షన్ లేదా ఆపై రన్ అయ్యే ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ ఫీచర్ సపోర్టు చేస్తుందని కంపెనీ తెలిపింది. లొకేషన్ డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, అవాంఛిత ట్రాకింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు డివైజ్ లొకేషన్ రిపోర్టింగ్ వంటి ఫీచర్‌లతో ‘ఫైండ్ మై డివైజ్’ నెట్‌వర్క్ సెక్యూరిటీ, ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తుందని గూగుల్ పేర్కొంది.

Read Also : Truecaller Web : ట్రూకాలర్ వెబ్‌ వెర్షన్ వచ్చేసిందోచ్.. మీ కంప్యూటర్ స్ర్కీన్ పైనే నేరుగా రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందొచ్చు!