Google Pixel 7a Price : గూగుల్ పిక్సెల్ 7a ధర ఎంతో తెలిసిందోచ్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. Pixel 6a కన్నా ఖరీదైనదేనా?

Google Pixel 7a Price Leak : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 7a సిరీస్ (Google Pixel 7a Series) ఫోన్ వస్తోంది. లాంచ్ కావడానికి ముందే రాబోయే ఈ కొత్త ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.

Google Pixel 7a Price : గూగుల్ పిక్సెల్ 7a ధర ఎంతో తెలిసిందోచ్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్.. Pixel 6a కన్నా ఖరీదైనదేనా?

Google Pixel 7a price leaked ahead of launch, is it going to be more expensive than Pixel 6a

Google Pixel 7a Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ నుంచి కొత్త సిరీస్ ఫోన్ వస్తోంది. గూగుల్ పిక్సెల్ 7a సిరీస్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతోంది. గూగుల్ మే 10న జరగబోయే (Google IO 2023) ఈవెంట్‌లో లేటెస్ట్ జనరేషన్ (Google Pixel 7a) ఫోన్ సహా Pixel Fold అనే మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి కొంతకాలంగా రుమర్లు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటనకు ముందే ఈ పిక్సెల్ 7a ఫోన్ ధరలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.

(Tipster Jon Prosser) ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ 499 డాలర్లు (దాదాపు రూ. 40వేల) నుంచి ప్రారంభమవుతుంది. Pixel 6a లాంచ్ ధరతో పోలిస్తే.. ఈ ఫోన్ 50 డాలర్లు పెరిగింది. పిక్సెల్ ఫోల్డ్ 1,799 డాలర్లు (దాదాపు రూ. 1.47 లక్షలు) వద్ద ప్రారంభం కానుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్‌ను గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

పిక్సెల్ 7a చార్‌కోల్, స్నో, సీ (లైట్ బ్లూ), కోరల్ బ్లూ కలర్స్‌లో కస్టమర్‌లు ఎంచుకోవచ్చని ట్వీట్‌లో పేర్కొంది. ఈ ఫోన్ లాంచ్ అయిన వెంటనే కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని నివేదిక తెలిపింది. మరోవైపు, పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) ఫోన్ ఈ ఏడాది చివరిలో సేల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్‌ను ప్రవేశపెడుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. అయితే, కంపెనీ గతంలో పిక్సెల్ A-సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇప్పుడు Pixel 7a కూడా భారత్‌కు రాకపోవచ్చని తెలుస్తోంది. టిప్‌స్టర్ భారత మార్కెట్లో నిర్దిష్ట ధరలను రివీల్ చేయలేదు. Pixel 7a ధర రూ. 40వేల కన్నా ఎక్కువగా ఉంటుందని భావించవచ్చు. గత ఏడాదిలో గూగుల్ భారత మార్కెట్లో పిక్సెల్ 6aని రూ.43,999కి 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్లను లాంచ్ చేసింది.

Read Also : HP India New Laptops : ఇంటెల్ CPUతో HP ఇండియా నుంచి 4 కొత్త ల్యాప్‌టాప్స్.. ఏ మోడల్ ధర ఎంతంటే?

Pixel 7a భారత్‌లో లాంచ్ చేసిన తర్వాత Pixel 6a ధర తగ్గింపును కూడా పొందవచ్చు. ప్రస్తుతం, (Pixel 6a) ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో రూ. 28,999కి అందుబాటులో ఉంది. Pixel 7a కూడా ఈ ఏడాదిలో పెద్ద అప్‌గ్రేడ్‌లను అందుకోవచ్చునని భావిస్తున్నారు. డిజైన్ పరంగా చూస్తే.. పిక్సెల్ 6a మాదిరిగానే ఉండవచ్చు. డ్యూయల్ రియర్ కెమెరాలలో హోల్-పంచ్ డిస్‌ప్లే, వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకార బార్‌ని చూడవచ్చు. Google ఫ్లాగ్‌షిప్ 7 Proలో మాత్రమే వెనుకవైపు 3 కెమెరాలను అందించింది.

Google Pixel 7a price leaked ahead of launch, is it going to be more expensive than Pixel 6a

Google Pixel 7a Price Leak : Google Pixel 7a price leaked ahead of launch, is it going to be more expensive than Pixel 6a

స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. Pixel 7a, పిక్సెల్ 6aలో 60Hz డిస్‌ప్లేకు బదులుగా 90Hz OLED డిస్‌ప్లేను అందించవచ్చు. Google కస్టమైజడ్ టెన్సర్ G2 చిప్‌సెట్‌ని కలిగి ఉండవచ్చు. LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజీ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది. 18W వైర్డ్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టుతో ఫోన్‌లో 4,410mAh బ్యాటరీ ఉండవచ్చునని లీక్ సూచిస్తుంది. ఈ ఫోన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ లేకపోవచ్చు. ఈ శ్రేణిలోని చాలా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఇది ఉండదు. ప్రత్యర్థి నథింగ్ ఫోన్ (1) వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు ఇస్తుంది.

ఇతర ముఖ్య ఫీచర్లలో 5G, 64-MP సోనీ IMX787 ప్రైమరీ సెన్సార్, 12-MP అల్ట్రా-వైడ్ సోనీ IMX712 కెమెరా ఉన్నాయి. ఈ డివైజ్ స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుందని చెప్పారు. చివరగా, గూగుల్ కనీసం 3 సంవత్సరాల అప్‌డేట్లను అందించనుంది. మరోవైపు, పిక్సెల్ ఫోల్డ్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 4 మాదిరిగానే వెనుకవైపు 3 కెమెరాలు, 2 సెల్ఫీ కెమెరాలు ఉండవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 లేదా 13Lలో రన్ అవుతుంది. ఫోల్డబుల్, టాబ్లెట్‌లలో సపోర్టెడ్ OSతో రావొచ్చు.

Read Also : WhatsApp Animated Emoji : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. లేటెస్ట్ బీటాలో యానిమేటెడ్ ఎమోజీ వస్తోంది..!