Google Pixel 8a Launch : గూగుల్ పిక్సెల్ 8ఎ సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, కలర్ ఆప్షన్లు లీక్..!

Google Pixel 8a Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మరికొద్ది రోజులు ఆగండి.. గూగుల్ పిక్సెల్ 8ఎ సిరీస్ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు ముందుగానే లీకయ్యాయి.

Google Pixel 8a Launch : గూగుల్ పిక్సెల్ 8ఎ సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, కలర్ ఆప్షన్లు లీక్..!

Google Pixel 8a Design and Colour Options Leak

Google Pixel 8a Launch : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ నుంచి సరికొత్త ఫోన్ పిక్సెల్ 8ఎ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందుగానే పిక్సెల్ 8ఎ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు లీక్ అయ్యాయి. గత ఏడాదిలో వచ్చిన పిక్సెల్ 7a ఫోన్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్. త్వరలో గూగుల్ I/O 2024 ఈవెంట్ ప్రారంభం కానుంది.

ఈ ఈవెంట్లో పిక్సెల్ 8ఎ సరసమైన వెర్షన్‌గా వస్తుందని నివేదిక పేర్కొంది. రాబోయే పిక్సెల్ 8a హ్యాండ్‌సెట్ మొత్తం 4 కలర్ ఆప్షన్లతో రానుంది. గత నివేదికల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ 4,500mAh బ్యాటరీని కలిగి ఉండనుంది. కంపెనీ టెన్సర్ G3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.

Read Also : Oppo A3 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో A3 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

మొత్తం 4 కలర్ ఆప్షన్లలో పిక్సెల్ 8ఎ :
గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ.. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లపై అనేక లీక్‌లు ఉన్నాయి. నివేదిక ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 8a వచ్చే నెలలో బే (బ్లూ), మింట్ (గ్రీన్), అబ్సిడియన్ (బ్లాక్), పింగాణీ (వైట్) అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది.

పిక్సెల్ 8a గత ఏడాదిలో లాంచ్ అయిన పిక్సెల్ 8 ఫోన్‌కు దగ్గరి పోలికను కలిగి ఉంటుందని లీక్ ఫొటోలు సూచిస్తున్నాయి. ఆ తరువాతి హాజెల్, మింట్, అబ్సిడియన్, రోజ్ కలర్ ఆప్షన్‌లలో వచ్చింది. పిక్సెల్ 8a అధునాతన మోడళ్లతో కలిపి కనీసం రెండు కలర్ ఆప్షన్లతో రానుంది.

పిక్సెల్ 8ఎ స్పెషిఫికేషన్లు (అంచనా) :
గూగుల్ పిక్సెల్ 8a లైవ్ ఇమేజ్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. గూగుల్ నెక్స్ట్ A-సిరీస్ పిక్సెల్ ఫోన్ డిజైన్ ఏంటి? దానిపై క్లారిటీ కొద్దిగా హింట్ ఇచ్చింది. లీకైన ఫొటో ప్రకారం.. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పిక్సెల్ 8 మాదిరిగానే బ్యాక్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అయితే, బ్యాక్ ప్యానెల్ పిక్సెల్ 7a మాదిరిగా కాకుండా ఎండ్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. గత నివేదికల ప్రకారం.. పిక్సెల్ 8ఎ ఫోన్ 8జీబీ ర్యామ్‌తో పాటు పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోకి పవర్ అందించే చిప్ గూగుల్ టెన్సర్ జీ3తో రావచ్చు.

ఈ ఫోన్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ (1,080×2,400 పిక్సెల్‌లు) ఓఎల్ఈడీ ప్యానెల్‌ను 1,400 నిట్స్ గరిష్ట హెచ్‌డీఆర్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని అంచనా. పిక్సెల్ 8ఎ ఫోన్ కూడా పిక్సెల్ 7ఎ మాదిరిగా అదే కెమెరా కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కలిగి ఉంది. 27డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. వచ్చే మే 14న ప్రారంభమయ్యే గూగుల్ I/O 2024 ఈవెంట్‌లో పిక్సెల్ 8ఎ గురించి మరిన్ని వివరాలను రివీల్ చేసే అవకాశం ఉంది.

Read Also : Moto G64 5G Launch : ఈ నెల 16న భారత్‌కు మోటో G64 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?