RBI MPC Meeting: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా 11వ సారి.. అలా ఎందుకంటే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొసాగించింది. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది.

RBI MPC Meeting: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా 11వ సారి.. అలా ఎందుకంటే?

RBI Governor Shaktikanta Das

Updated On : December 6, 2024 / 11:21 AM IST

RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొసాగించింది. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీంతో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఇది 11వ సారి. ఆర్బీఐ ద్రవ్య పరతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం ప్రకటించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తిని 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.16 లక్షల కోట్ల అదనపు నగదు అందుబాటులోకి వస్తుంది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడంలో సహాయపడుతుంది. తద్వారా బ్యాంకులు వృద్ధిని వేగవంతం చేయడానికి మరింత ఎక్కువ రుణాలను పంపిణీ చేయడానికి సహాయ పడుతుంది.

Also Read: Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?

ద్రవ్వోల్బణం, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారికూడా వడ్డీరేట్లలో మార్పులు చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈసారి స్థిరవిధాన వైఖరిని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. రూపాయి విలువను బలోపేతం చేసేందుకు ఎన్ఆర్ఐ డిపాజిట్లపై పరిమితిని పెంచుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఆర్బీఐ ఖరీదైన ఈఎంఐ నుంచి ఉపశమనం కల్పించలేదు.

Also Read: Gold Price: వచ్చే ఏడాది బంగారం ధర భారీగా పెరగబోతుందా.. అందుకు కారణాలు ఏమిటంటే?

2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 6.6శాతంగా అంచనా వేసింది. గత త్వైమాసిక సమీక్షలో దీన్ని 7.2శాతంగా అంచనా వేయగా.. ప్రస్తుతం కాస్త తగ్గించాల్సి వచ్చింది. జూలై – సెప్టెంబరు త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాల కంటే తక్కువగా 5.4శాతంగా ఉంది. ఈ క్రమంలో జీడీపీ వృద్ధిరేటు క్షీణతపై ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి రేటు క్షీణతకు కారణం పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పారిశ్రామిక వృద్ధిరేటు 7.2శాతంకాగా, రెండో త్రైమాసికంలో 2.1 శాతానికి తగ్గింది. తయారీ రంగం వృద్ధి రేటు తగ్గిందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగిందని, అయితే, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గుతోందని తెలిపారు.