సోషల్ మీడియాలో వైరల్ : 2వేల నోటు రద్దు కాబోతోందా

2వేల రూపాయల నోటు రద్దు కాబోతోందా? ప్రస్తుతం దేశంలో ఇదే హాట్ టాపిక్. 2వేల రూపాయల నోటు రద్దు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలోనే 2వేల రూపాయల నోటుని రద్దు చేస్తారని సోషల్ మీడియా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం 2వేల రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. 2వేల రూపాయల నోటు అక్రమార్కులకు వరంగా మారిందని, ట్యాక్ ఎగ్గొట్టడానికి, బ్లాక్ మనీ పెంచుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. కేంద్రం ప్రభుత్వం కూడా దీనిపై ఆలోచనలో పడింది. దీంతో 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసింది.
రూ.2వేల నోటు అవసరమా?
దేశంలో బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ తీసుకున్నారు. 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేశారు. నోట్ల కష్టాలకు పరిష్కారంగా వాటి ప్లేస్‌లో 2వేల రూపాయల నోటును తీసుకొచ్చారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నాడు తీసుకున్న నిర్ణయం దేశంలో సంచలనం అయ్యింది. పెద్ద నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్‌లో 2వేల రూపాయల నోటును తీసుకురావడం మరింత సంచలన అయ్యింది. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.