GST Rate Cut : పండగ చేస్కోండి.. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి.. భారీగా తగ్గిన ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు.. ఫుల్ లిస్ట్ ఓసారి లుక్కేయండి!
GST Rate Cut : కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. 12శాతం, 28శాతం స్లాబ్‌లను కేంద్రం తొలగించింది. గతంలో 28శాతం నుంచి 18శాతానికి మార్చింది.

GST Rate Cut
GST Rate Cut : కొనుగోలుదారులకు పండగే.. కొత్త టీవీ, ఏసీలు, రిఫ్రిజరేటర్లు కొనేవారికి గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లు తగ్గాయి. ఈ రోజు నుంచి కొనుగోలు చేసే వస్తువులు సరసమైన ధరకే లభించనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్తగా తగ్గించిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి.
కొత్త జీఎస్టీ రేట్లతో అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, హోం అప్లియన్సెస్ (GST Rate Cut) మరింత సరసమైనవిగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనేక నిత్యావసర వస్తువులపై వస్తువులు, సేవల పన్ను తగ్గింపును ఆమోదించింది. వినియోగదారులకు భారీ మొత్తంలో సేవింగ్స్ చేసుకోవచ్చునని భావిస్తున్నారు.
ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ ధరలు తగ్గింపు :
ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి అనేక గృహోపకరణాలు ఇప్పుడు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. గతంలో 28 శాతంగా ఉండేది. ఈ కొత్త మార్పుతో వినియోగదారులు ఈ ప్రొడక్టులపై 8 శాతం నుంచి 10 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. కొత్త జీఎస్టీ రేట్ల తర్వాత కొన్ని కంపెనీలు ఇప్పటికే ధర తగ్గింపులను ప్రకటించాయి.
ఉదాహరణకు.. ఏసీలు, టీవీల ధరను రూ. 10వేల వరకు తగ్గించవచ్చు. ప్రధాన అప్లియన్సెస్‌తో పాటు, ఛార్జర్‌ల వంట మొబైల్ అప్లియన్సెస్‌పై కూడా జీఎస్టీ తగ్గింది. తద్వారా అవి చౌకగా ఉంటాయి. అదనంగా, మిక్సర్-గ్రైండర్లు, మైక్రోవేవ్‌లు, వాక్యూమ్ క్లీనర్‌లు, ఎయిర్ కూలర్‌ల వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా భారీగా తగ్గుతాయి.
ఎంత ఆదా చేసుకోవచ్చంటే? :
వినియోగదారులు తగ్గిన జీఎస్టీ రేట్లతో భారీగా సేవింగ్స్ చేసుకోవచ్చు. కొత్త జీఎస్టీ రేట్లు ధరలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎయిర్ కండిషనర్ :
గతంలో, రూ.30వేలు ధర కలిగిన 1-టన్ ఏసీపై 28 శాతం జీఎస్టీ రూ.8,400 ఉండేది. కొత్త 18 శాతం రేటుతో పన్ను ఇప్పుడు రూ.5,400కు తగ్గింది. అంటే మీకు రూ.3వేలు ఆదా అవుతుంది.
టెలివిజన్ :
32 అంగుళాల కన్నా పెద్ద LCD, LED టీవీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. రూ. 20వేల విలువైన టీవీకి గతంలో జీఎస్టీ రూ. 5,600 ఉండగా ఇప్పుడు రూ. 3,600కు తగ్గింది. అంటే ఇక్కడ మీకు రూ. 2వేలు ఆదా అవుతుంది.
డిష్‌వాషర్ :
రూ.10వేల ఖరీదైన డిష్‌వాషర్‌పై గతంలో రూ.2,800 జీఎస్టీ 28 శాతం ఉండేది. కొత్త జీఎస్టీ రేటు ప్రకారం.. జీఎస్టీ రూ.1,800 అంటే.. రూ.1,000 ఆదా అవుతుంది.
జీఎస్టీ కౌన్సిల్ మానిటర్లు, ప్రొజెక్టర్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దాంతో వినియోగదారులు కొనుగోళ్లపై భారీగా ఆదా చేసుకోవచ్చు.