Hurun report: భారత్‌లోని మహిళల్లో అత్యంత సంపద ఉన్నది ఈమెకే.. ఎన్ని లక్షల కోట్లంటే? టాప్ 10లో ఎవరెవరు?

ఓవరాల్‌గా సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ రూ.9.55లక్షల కోట్లతో అగ్ర స్థానంలో నిలిచారు.

Hurun report: భారత్‌లోని మహిళల్లో అత్యంత సంపద ఉన్నది ఈమెకే.. ఎన్ని లక్షల కోట్లంటే? టాప్ 10లో ఎవరెవరు?

Roshni Nadar Malhotra

Updated On : October 1, 2025 / 6:50 PM IST

భారత్‌లోని మహిళల్లో అత్యంత సంపద ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? బుధవారం విడుదలైన ఎమ్3ఎం హ్యూరన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో ఈ విషయం తేలింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఎచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్‌ రోష్నీ నాడార్ మల్హోత్రా (44) భారత్‌లో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు. ఆమె సంపద 2.84 లక్షల కోట్లు.

ఇక ఓవరాల్‌గా సంపన్నుల జాబితాలో పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ రూ.9.55లక్షల కోట్లతో అగ్ర స్థానంలో నిలిచారు. రూ.8.15 లక్షల కోట్లతో గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం నిలిచింది. మూడో స్థానంలో రోష్నీ నాడార్‌ మల్హోత్రా ఉన్నారు.

ఇది చరిత్రాత్మకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళ తొలిసారి టాప్ 3లో ర్యాంకింగ్‌లో చేరారు. “మొదటిసారి ఓ మహిళ టాప్ 3లో చేరారు. రోష్ని నాడార్ మల్హోత్రా 3వ స్థానంలోకి ప్రవేశించారు” అని హ్యూరన్ లిస్ట్‌లో పేర్కొన్నారు.

మల్హోత్రా కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. హెచ్‌సీఎల్‌ను ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి, ఐటీ సర్వీసెస్‌లో మరింత బలోపేతం చేశారు. శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో కూడా రోష్నీ తరచుగా ర్యాంక్ దక్కించుకుంటారు.

హ్యూరన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 – టాప్ 10

ర్యాంక్ పేరు సంపత్తి 2025 (రూ. కోట్లలో)
1 ముకేష్ అంబానీ, కుటుంబం 9,55,410
2 గౌతం అదానీ, కుటుంబం 8,14,720
3 రోష్నీ నాడార్ మల్హోత్రా, కుటుంబం 2,84,120
4 సైరస్ ఎస్ పూనావాలా, కుటుంబం 2,46,460
5 కుమార్ మంగళం బిర్లా, కుటుంబం 2,32,850
6 నిరాజ్ బజాజ్, కుటుంబం 2,32,680
7 దిలీప్ షాంగ్‌వి 2,30,560
8 అజీమ్ ప్రెమ్జీ, కుటుంబం 2,21,250
9 గోపిచంద్ హిందుజా, కుటుంబం 1,85,310
10 రాధాకిషన్ దాయని, కుటుంబం 1,82,980