నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో డౌన్ : ఇండియాలో Hotstar నెంబర్‌వన్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసు అందించే హాట్ స్టార్.. ఇండియాలో నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ప్రపంచ అతిపెద్ద ఇంటర్నెట్ ఎంటర్ టైన్ మెంట్ ఓటీటీ సర్వీసు అందించే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీసును హాట్ స్టార్ దాటేసింది.

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసు అందించే హాట్ స్టార్.. ఇండియాలో నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ప్రపంచ అతిపెద్ద ఇంటర్నెట్ ఎంటర్ టైన్ మెంట్ ఓటీటీ సర్వీసు అందించే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీసును హాట్ స్టార్ దాటేసింది.
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసు అందించే హాట్ స్టార్.. ఇండియాలో నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ప్రపంచ అతిపెద్ద ఇంటర్నెట్ ఎంటర్ టైన్ మెంట్ ఓటీటీ సర్వీసు అందించే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీసును హాట్ స్టార్ దాటేసింది. ఈ రెండు ఓటీటీ దిగ్గజాలను వెనక్కి నెట్టి దేశంలో టాప్ ర్యాంకులో వాల్ట్ డిస్నీ కంపెనీ హాట్ స్టార్ నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫాం సర్వీసు దిగ్గజాల్లో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలకు పోటీగా హాట్ స్టార్ యూజర్లను కట్టిపడేస్తోంది. అందుకే ఎక్కువ మంది యూజర్లు హాట్ స్టార్ సర్వీసును ఎక్కువ సమయం వినియోగిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది. యాప్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫాం మో మ్యాజిక్ యాప్ నిర్వహించిన సర్వేలో హాట్ స్టార్ (over-the-top) OTT సర్వీసు ముందుంజలో నిలిచింది.
దేశంలో 41 శాతం మంది యూజర్లు HotStar సర్వీసునే వాడుతున్నారు. ఇతర పోటీదారులైన అమెజాన్ ప్రైమ్ వీడియో(26శాతం) , నెట్ ఫ్లిక్స్ (9 శాతం) సర్వీసులతో పోలిస్తే హాట్ స్టార్ సర్వీసుకు 41 శాతం మంది అధికంగా వాడుతున్నారని సర్వేలో వెల్లడైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోకు 13 మిలియన్లు, నెట్ ఫ్లెక్స్ 11 మిలియన్ల మంది యూజర్లతో పోలిస్తే హాట్ స్టార్ సబ్ స్రైబర్లు 300 మిలియన్ సబ్ స్రైబర్లు ఉన్నట్టు రెడ్ షీర్ కన్సెల్టెంగ్ రిపోర్టు తెలిపింది. ఇతర పోటీదారుల్లో వూట్, జీ5, అర్రే, సోనీLIV సర్వీసులు కూడా వేగంగా పుంజుకుంటున్నాయి.
సర్వే ప్రకారం.. OTT ప్లాట్ ఫాంలపై 55 శాతం మంది వీడియో కంటెంట్ వీక్షించేందుకు ప్రాధాన్యత ఇస్తుండగా.. గత 6 నెలల్లో కనీసం మేజర్ ఓటీటీ ప్లాట్ ఫాంపై 85శాతం మంది వీక్షిస్తున్నారని తెలిపింది. చౌకైన మొబైల్ డేటా ధరలు, ఆన్ డిమాండ్ వీడియో సర్వీసులు అందించే ఓటీటీ ప్లాట్ ఫాంలకు భారీగా డిమాండ్ పెరుగుతుండటంతో DTH ఆపరేటర్లకు గట్టి పోటీ ఎదురువుతోంది. టెలివిజన్ సర్వీసులతో పోలిస్తే మొబైల్ ఫోన్ల ద్వారా ఓటీటీ సర్వీసులను వీక్షించేందుకు యూజర్లు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు సర్వే తెలిపింది.
మొబైల్ ఫోన్ల ద్వారా ఓటీటీ కంటెంట్ వీక్షించేవారు 70శాతానికి పెరగగా… వారిలో 26శాతం మాత్రమే టీవీల్లో ఓటీటీ కంటెంట్ వీక్షిస్తున్నారు. బూస్టన్ కన్సెల్టెంట్ గ్రూపు అంచనా ప్రకారం.. ఇండియాలో వీడియో ఆన్ డిమాండ్ మార్కెట్ గత ఏడాది 500 మిలియన్ డాలర్ల నుంచి 2023 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ప్రత్యేకించి.. ఓటీటీ సర్వీసు కోసం చెల్లించే సబ్ స్ర్కైబర్లు 50మిలియన్లకు చేరనున్నారు. అడ్వర్టైజింగ్ సపోర్టెట్ వీడియో ఆన్ డిమాండ్ యూజర్లు 600 మిలియన్లకు చేరనున్నట్టు సర్వే తెలిపింది.