వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : మీ అకౌంట్లో Lock సెట్ చేసుకోండిలా

  • Published By: sreehari ,Published On : November 2, 2019 / 10:15 AM IST
వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : మీ అకౌంట్లో Lock సెట్ చేసుకోండిలా

Updated On : November 2, 2019 / 10:15 AM IST

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అకౌంట్లో చాట్ బాక్సు ప్రైవసీ కోసం బయోమెట్రిక్ లాకింగ్ తీసుకొచ్చింది. కొన్నినెలల క్రితమే ఐఓఎస్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫింగర్ ఫ్రింట్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం.. ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ అకౌంట్లో ఫింగర్ ఫ్రింట్ లాకింగ్ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు మెసేజింగ్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వాట్సాప్ యూజర్ల అకౌంట్ సెక్యూరిటీ కోసం ప్రత్యేకించి ఈ బయోమెట్రిక్ లాకింగ్ ఫీచర్ తీసుకొచ్చినట్టు తెలిపింది. 

వాట్సాప్ అకౌంట్లోని అన్ని చాట్స్, నోటిఫికేషన్లను లాక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ స్ర్కీన్ లాక్ ద్వారానే ఈజీగా వాట్సాప్ అకౌంట్ స్ర్కీన్ లాక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. మీ వాట్సాప్ అకౌంట్ ఎంత సమయం వరకు లాక్ చేసుకోవాలో కస్టమైజడ్ ఆప్షన్లు కూడా ఇచ్చింది.

ఇందులో EveryTime, 1 Minute, 30Minutes ఇలా మీకు నచ్చిన సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. మీరు వాడే ఆండ్రాయిడ్ డివైజ్ లో ఫింగర్ ఫ్రింట్ ఆప్షన్ ఉండాలి. మీ డివైజ్ స్ర్ర్కీన్ లాక్ ఫింగర్ ఫ్రింట్ తో లింక్ అయి ఉండాలి. అప్పుడే మీ వాట్సాప్ స్ర్కీన్ లాక్ సెట్ చేసుకునేందుకు వీలుంది. 

ఫింగర్ ఫ్రింట్ లాక్ ఎనేబుల్ చేయాలంటే? :
* మీ ఆండ్రాయిడ్ డివైజ్‌లో ఫింగర్ ఫ్రింట్ Unlocking రిజిస్ట్రర్ అయి ఉండాలి.
* ముందుగా మీ వాట్సాప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోండి
* ప్లే స్టోర్ పై లేటెస్ట్ వెర్షన్ 2.19.308 వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకోండి.
* ఒకసారి Update చేశాక.. వాట్సాప్ సెట్టింగ్స్ స్ర్కీన్‌పై 3(…)మెనూ కనిపిస్తుంది.
* Accounts సెక్షన్ లోకి వెళ్లి Privacy ఆప్షన్ ఎంపిక చేసుకోండి.
* కిందికి స్ర్కోల్ డౌన్ చేసి FingerPrint Lock ట్యాప్ చేయండి.
* ఇక్కడ Unlock with FingerPrint బటన్ టర్న్ ఆన్ చేయండి.
* ఆటోమాటిక్ లాక్ అనే సెక్షన్ ఒకటి కనిపిస్తుంది.
* ఇందులో Immediately, After 1 minute, After 30 minutes 3 ఆప్షన్లు ఉంటాయి.
* మీకు నచ్చిన సమయాన్ని సెట్ చేసుకుంటే చాలు.. 
* మీ వాట్సాప్ అకౌంట్ సెట్ చేసిన సమయానికి లాక్ అయిపోతుంది.
* వాట్సాప్ Unlcok చేయాలంటే.. మీ ఫింగర్ ఫ్రింట్ తో Touch చేస్తే సరిపోతుంది.