లాక్‍డౌన్ ప్రభావం మనమీద, మార్కెట్‌పై ఎలా ఉంటుంది? ఈ నాలుగు అంచనాల్లో ఒకటి నిజం కావచ్చు!

  • Published By: veegamteam ,Published On : March 25, 2020 / 08:46 AM IST
లాక్‍డౌన్ ప్రభావం  మనమీద, మార్కెట్‌పై ఎలా ఉంటుంది? ఈ నాలుగు అంచనాల్లో ఒకటి నిజం కావచ్చు!

Updated On : March 25, 2020 / 8:46 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలో ఈ వైరస్ కేసులు పెరగడంతో సెకండ్ స్టేజ్ కి వచ్చేసింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముడవ స్టేజ్‌లో.. పరిస్థితిని పరిష్కరించడానికి ఉద్యోగాలు కోల్పోవడం, విస్తరించిన బ్యాలెన్స్ షీట్లు, బలహీనమైన వినియోగదారుల డిమాండ్ వంటి చర్యలను ప్రభుత్వం సమీక్షించాలి. 

మొదటి రెండు రౌండ్‌ల కరోనావైరస్ వ్యాప్తి ఇప్పటికే 52 లక్షల కోట్ల రూపాయల విలువైన ఈక్విటీ ఇన్వెస్టర్ సంపద పడిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు 35 శాతం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇక ప్రభుత్వం మంగళవారం నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. దీనివల్ల అన్ని ఆర్ధిక కార్యకలాపాలను నిలిపివేసే అవకాశం ఉంది.

అంచనా 1:
భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటుంది. ఇటువంటి సమయంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ మన దేశ ఆర్ధిక వ్యవస్థపై చాలా గట్టిగానే పడే అవకాశాలు ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే భారత్ పరిస్థితి దిగజారితే జీడీపీ వృద్ధి రేటు 4.5 నుంచి 5శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. పరిస్థితి పూర్తిగా మారిపోయిన సంధర్భంలో ప్రపంచంలో ఇదే పరిస్థితి ఉంటే దేశీయ ఎగుమతులపై తీవ్రప్రభావం పడుతుంది అని అప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యే అవకాశం ఉందని అంచనా. 

అంచనా  2:
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రస్తుతం ప్రకటించిన లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉంటుంది. అప్పటిలోగా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం లేకపోతే లాక్ డౌన్ ఇంకా కొనసాగించాల్సిన పరిస్థితి. ఆర్థిక సంవత్సరంలో మార్చి మొదటి త్రైమాసికం ఎఫెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 వరకు కొనసాగుతూనే ఉంటుందని, అప్పుడు 4.5 నుంచి 5శాతం చేరుకోవాలనే ఆర్ధిక టార్గెట్ అందుకునే అవకాశం లేదు.

అంచనా 3:
ఒకవేళ వైరస్ భారతదేశంలో ఉండి, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం తీవ్రతరం అయితే, ప్రపంచ మాంద్యం మధ్య భారత ఈక్విటీలు కాస్త పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు భారత జీడీపీ 4-4.5 శాతానికి పెరుగుతుందనేది ఓ అంచనా.
 
అంచనా 4:
చివరగా భారతదేశంలో వైరస్ ఉండి, ప్రపంచవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంటే, భారతీయ మార్కెట్లు ప్రపంచ మార్కెట్లను అదిగమిస్తాయి. అదే ప్రస్తుతం ఉన్నట్లుగానే ఉంటే  మాత్రం భారతదేశంపై ఆర్థిక ప్రభావం ఉంటుంది. ప్రపంచ ఆర్థిక మందగమనం 3నుంచి 5 నెలల పాటు ఉంటుంది అని ఆర్థిక వేత్తల అంచనా. 

* ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం (మార్చి 24, 2020)న వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ సమయంలో ఆర్థికంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోందని నిర్మల అన్నారు.

See Also | లాక్ డౌన్ కోసం పనిచేస్తే రూ.1000