HSBCలో 10 వేల ఉద్యోగుల తొలగింపు!

ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. అమెరికా – చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారి తీసే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖర్చులను తగ్గించడానికి పలు కంపెనీలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా ఉద్యోగులను తగ్గించేందుకు ప్లాన్స్ వేస్తున్నాయి. ఐరోపాలో అతిపెద్ద బ్యాంకుగా ఉన్న HSBC త్వరలో ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. నిర్వాహణ ఖర్చులు తగ్గించుకొనే భాగంగా..దాదాపు పది వేలమంది ఉద్యోగాల్లో కోత ఉండే అవకాశం ఉందని ఓ జాతీయ ప్రతిక ప్రచురించడం చర్చనీయాంశమైంది.
నిర్వాహణ ఖర్చులు తగ్గించుకొనే ప్రధాన టార్గెట్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడో త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉన్నట్లు టాక్. పెద్ద జీతాలు పొందుతున్న వారిపై దృష్టి సారించినట్లు..వీరిని తొలగించేందుకు సంస్థ రంగం సిద్ధం చేస్తోందని కథనం. ఆగస్టులో సంస్థ సీఈవోగా ఉన్న జాన్ ప్లింట్‌ను తొలగించారు. ఈయన స్థానంలో క్విన్‌ను నియమితులయ్యారు. ఛైర్మన్ మార్క్ టక్కర్‌తో ఉన్న విబేధాల కారణంగా..ప్లింట్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది.
కంపెనీకి సంబంధించిన నిర్వాహణ ఖర్చులను తగ్గించుకొనే విషయంలో ప్లింట్ ఫెయిల్ అయ్యారని అప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. ప్రస్తుతం సీఈవో స్థానంలో ఉన్న క్విన్ సంస్థల్లో సంస్కరణలను ప్రవేశ పెడుతున్నారు. మొదట్లో 4 వేల మంది ఉద్యోగస్తులను తొలగించానమి హెచ్ఎస్‌బీసీ ప్రకటన చేసిన అనంతరం..ఇప్పుడు పది వేల ఉద్యోగులను తొలగిస్తామన్న ప్రకటనతో ఎంప్లాయిస్‌లు ఆందోళన పడుతున్నారు. అమెరికా – చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం బ్యాంకుపై పడినట్లు, హాంకాంగ్‌లో అనిశ్చితి నెలకొనడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read More : వాట్సాప్‌లో BUG : అప్పటివరకూ GIF ఫైల్స్ పంపొద్దు