Real Luxury Houses : ధర ఎంతైనా ఓకే : హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్టులకు భారీ డిమాండ్
Luxury Houses : ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్టులకు భారీగా డిమాండ్ పెరిగింది. అందులోనూ ఓఆర్‌ఆర్‌కు సమీపంలో విల్లా కల్చర్ పెరిగిపోతోంది.

Huge Demand For Luxury Projects in Hyderabad
Real Luxury Houses : ఒకప్పుడు ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు అనుకునేవాళ్లు. కానీ, ప్రస్తుతం ధర ఎక్కువైనా సరే మంచి గ్రీనరీ ఉన్న ఇళ్లవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కొనుగోలుదారులు. సిటీకి నలువైపులా చక్కని ట్రాన్స్‌ఫోర్ట్ సౌకర్యంతో పాటు ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర ప్రాంతాల్లోని లగ్జరీ ఇళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
ధర ఎంతైనా ఓకే :
కొత్త ఇళ్లను కొనుగోలు చేసే కొనుగోలుదారులు లగ్జరీకి ఇళ్లకే జై కొడుతున్నారు. ధర కాస్త ఎక్కువైనా బయ్యర్స్ తగ్గేదేలే అంటోన్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్టులకు భారీగా డిమాండ్ పెరిగింది. చక్కని గ్రీనరీతో పాటు లగ్జరీ ఎమినిటీస్ తప్పనిసరి అనేది ఎక్కువగా వినిపిస్తోంది. అందులోనూ ఓఆర్‌ఆర్‌కు సమీపంలో విల్లా కల్చర్ పెరిగిపోతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు సిటీ సరౌండింగ్‌లో అనేక విల్లా ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ధర కాస్త ఎక్కువైనా ఆహ్లాదకర వాతావరణానికి ప్రజలు జై కొట్టడంతో బయ్యర్స్ లగ్జరీ ప్రాపర్టీస్ నిర్మాణంపై దృష్టిపెట్టారు. లగ్జరీ ఎమినిటీస్‌తో పాటు గ్రీనరీకి ఈ ప్రాజెక్టుల్లో పెద్దపీట వేస్తున్నారు. బయ్యర్స్ అభిరుచికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపడుతున్నాయి.
అనేక సదుపాయాలతో లగ్జరీ ఇళ్లు :
కొనుగోలుదారుల మైండ్‌సెట్‌కు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల్లో ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ప్రాపర్టీస్‌ను డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్. లే అవుట్‌లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్లకు, ఫుట్‌పాత్‌లకు గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌజ్, జిమ్, పార్కులు, ఆటస్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారు.
ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. వరల్డ్ క్లాస్ ఎమినిటీస్‌తో పాటు పల్లె వాతావరణం ఉండేలా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు కొనుగోలుదారులు. దీంతో సువిశాలైన విస్తీర్ణంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు డెవలపర్స్.
Read Also : Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!