MERU International School: “మేరు ఇంటర్నేషల్ స్కూల్”కు ప్రతిష్టాత్మక “బ్రెయిన్‌ఫీడ్ ఎక్స్‌లెన్స్” అవార్డు

ప్రముఖ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ బ్రెయిన్‌ఫీడ్ అందించే "బ్రెయిన్‌ఫీడ్ స్కూల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ - 2022"కి గానూ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అవార్డు సొంతం చేసుకుంది.

MERU International School: “మేరు ఇంటర్నేషల్ స్కూల్”కు ప్రతిష్టాత్మక “బ్రెయిన్‌ఫీడ్ ఎక్స్‌లెన్స్” అవార్డు

Meru

MERU International School: చక్కని భవితకు గట్టి పునాదులు పడాలంటే పాఠశాల స్థాయిలోనే అందుకు అంకురార్పణ జరగాలి. మారుతున్న కాలానుగుణంగా చదువుతో పాటు..విద్యార్థుల్లో సాంప్రదాయ విలువలు, ఉన్నత లక్ష్యాలు ఏర్పరిచేలా పాఠశాల స్థాయిలోనే బీజం పడాలి. దేశంలో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందిస్తూ..వారి లక్ష్యాలు నెరవేర్చే దిశగా కృషి చేస్తున్న పాఠశాలలు దేశంలో అతికొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. అటువంటి అరుదైన జాబితాలో చోటుదక్కించుకుంది “మేరు ఇంటర్నేషనల్ స్కూల్”. హైదరాబాద్ లోని మదీనాగూడలో ఉన్న మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. ప్రముఖ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ బ్రెయిన్‌ఫీడ్ అందించే “బ్రెయిన్‌ఫీడ్ స్కూల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ – 2022″కి గానూ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అవార్డు సొంతం చేసుకుంది.

బ్రెయిన్‌ఫీడ్ మ్యాగజైన్ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో హోటల్ లో నిర్వహించిన 9వ జాతీయ సదస్సులో..దేశంలోని పలు ప్రముఖ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించి, వినూత్నమైన విధానంలో జీవిత నైపుణ్యాలను జోడించి వారి భవితవ్యాన్ని తీర్చిదిద్దే టాప్ 500 పాఠశాలలను ఎంపిక చేసి ఈ అవార్డులు అందిస్తున్నారు బ్రెయిన్‌ఫీడ్ మ్యాగజైన్ నిర్వాహకులు. కిండర్ గార్టెన్(KG) నుండి సీనియర్ సెకండరీ స్కూల్ వరకు పిల్లలలో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నందుకు గానూ ఈ అవార్డు సొంతం చేసుకుంది.

మేరు ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ శ్రీమతి “మేఘనరావు జూపల్లి” ప్రత్యేకంగా రూపొందించిన M-CLAP (కెరీర్ రెడీనెస్, లీడర్‌షిప్ & లైఫ్ స్కిల్స్, అకడమిక్స్ & ఎన్‌రిచ్‌మెంట్ ప్రోగ్రామ్) ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులను భవిష్యత్తు సిద్ధంగా తీర్చిదిద్దడంలో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఈ ఘనత సాధించింది. విద్యార్థులను భవిష్యత్ సిద్ధంగా తీర్చిదిద్దడంలో అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనల అనంతరం ప్రవేశపెట్టిన K-12 పాఠ్యాంశ విధానం ఆధారంగా M-CLAP పనిచేస్తుంది. K-12 పాఠ్యాంశ విధానం ఇప్పటికే ఎన్నో అవార్డు-గెలుచుకుంది. ఇది కెరీర్ పరంగా విద్యార్థులను సంసిద్ధం చేయడం, నాయకత్వ మరియు జీవన నైపుణ్యాలను అందించే విధంగా ఉపాధ్యాయులకు తోడ్పాటు అందిస్తుంది. M-CLAP విధాన్నాన్ని అవలంబించడం ద్వారా విద్యార్థులు ఉద్యోగ సాధనలోనూ, జీవితంలోనూ విజయం సాధిస్తున్నారు.

కాలానుగుణంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వస్తున్న మార్పులను తట్టుకోవాలంటే విద్యార్థుల్లో సమస్య పరిస్కార నైపుణ్యాలు పెంపొందించాల్సి ఉంటుంది. “జెన్ నెక్స్ట్” కాన్సెప్ట్ అయిన M-CLAP ద్వారా “మేరు ఇంటర్నేషనల్ స్కూల్”లోని విద్యార్థులు 30 కంటే ఎక్కువ క్లిష్టమైన సామాజిక మరియు భావోద్వేగ నైపుణ్యాలను, వందలాది కార్యాచరణ-ఆధారిత పాఠాలతో, విద్యార్థులు సమర్థవంతంగా ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకుంటున్నారు. ఉన్నత లక్ష్యాల దిశగా అడుగులు వేసే తరుణంలో..విద్యార్థుల్లో బలమైన నాయకత్వ లక్షణాలు ఏర్పరుచుకోవడం, విభేదాలను పరిష్కరించడం, సమస్యలను పరిష్కరించడం, మరియు పరస్పరం గౌరవించడం సహకరించుకోవడం ఎలాగో నేర్చుకుంటారు.

స్కూల్ డైరెక్టర్ శ్రీమతి “మేఘనరావు జూపల్లి” ఆధ్వర్యంలో M-CLAP ప్రోగ్రామ్ ద్వారా స్కూల్ దశలోనే విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, ఉత్తమమైన కెరీర్ ను ఎంచుకునే విధంగా విద్యార్థులకు స్వేచ్ఛ కల్పిస్తున్న “మేరు ఇంటర్నేషనల్ స్కూల్”కు 2022కి గానూ “బ్రెయిన్‌ఫీడ్ స్కూల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్” అందిస్తున్నట్లు మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ కే.వీ బ్రహ్మం తెలిపారు. టీచర్లు, సిబ్బందితో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతోనే మేరు స్కూల్ ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిందని, ఈసందర్భంగా పేరెంట్స్ మరియు స్టూడెంట్ కమ్యూనిటీకి మేరు స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.