Gold Import Duty: బ‌డ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్

బంగారం, వెండికి సంబంధించిన చిన్నచిన్న హుక్స్, పిన్నులు వంటి వాటితోపాటు నాణేలపైనా దిగుమంతి సుంకాన్ని కేంద్రం పెంచింది.

Gold Import Duty: బ‌డ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్

Gold

Updated On : January 24, 2024 / 3:57 PM IST

Gold Silver Import Duty: బడ్జెట్ సమావేశాలకు ముందు బంగారం, వెండిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. బంగారం, వెండితోపాటు విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచి బంగారం, వెండి వినియోగదారులకు కేంద్రం షాకిచ్చింది. బంగారం, వెండి లోహాలు, విలువైన మెటల్ నాణేలపై దిగుమతి సుంకం ప్రస్తుతం 10శాతం ఉంది. దానిని 15శాతంకు కేంద్రం పెంచింది. ఇందులో 10శాతం ప్రాథమిక కస్టమ్ డ్యూటీ (బీసీడీ), ఐదు శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (ఏఐడీసీ) ఉన్నాయి. అయితే, దీనిపై విధించిన సోషల్ వెల్ఫేర్ సెస్ (ఎస్ డబ్ల్యూఎస్)లో మాత్రం పెంపుదల లేదు.

Gold Price

Also Read : Gold Rate Today : మూడు రోజులుగా అవే ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?

బంగారం, వెండికి సంబంధించిన చిన్నచిన్న హుక్స్, పిన్నులు వంటి వాటితోపాటు నాణేలపైనా దిగుమంతి సుంకాన్ని కేంద్రం పెంచింది. స్పెంట్ కేటలిస్ట్, యాష్ కంటెయినింగ్ ప్రెషియస్ మెటల్స్ మీదా 4.35శాతం ఏఐడీసీని వర్తింపజేస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. పెంచిన రేట్లు సోమవారం (జనవరి 22) నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, దేశ బడ్జెట్ కు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెడుతుంది. బడ్జెట్ లో ప్రకటించకుండానే జనవరి 22 నుంచే ఆర్థిక శాఖ కొత్త దిగుమతి సుంకాలను అమల్లోకి తీసుకొచ్చింది.

Gold

Also Read : బాలరాముడి దర్శనం, హారతి పాస్‌ల‌కు ఆన్‌లైన్‌ బుకింగ్ ఇలా చేసుకోండి.. పదేళ్లలోపు వారికి అయితే..

ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది ..
బంగారం, వెండి ముడి దిగుమతులపై, బంగారం, వెండి భాగాలపై విధించిన దిగుమంతి సుంకంలో బ్యాలెన్స్ లేకపోవడం, దానిని సక్రమంగా వినియోగించక పోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు, ఈ దిగుమతి సుంకాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.