బాలరాముడి దర్శనం, హారతి పాస్‌ల‌కు ఆన్‌లైన్‌ బుకింగ్ ఇలా చేసుకోండి.. పదేళ్లలోపు వారికి అయితే..

మంగళవారం నుంచి సామాన్య భక్తులు అందరూ బాలరాముడిని దర్శించుకొనేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో అర్థరాత్రి నుంచే మందిరం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

బాలరాముడి దర్శనం, హారతి పాస్‌ల‌కు ఆన్‌లైన్‌ బుకింగ్ ఇలా చేసుకోండి.. పదేళ్లలోపు వారికి అయితే..

Ram Temple in Ayodhya

Ayodhya Lord Ram : ధర్మానికి నిలువెత్తు రూపంగా నిలిచే శ్రీరామ చంద్రమూర్తి అయోధ్యలో కొలువుదీరారు. కోట్ల మంది భక్తుల మనసు పులకిస్తున్న వేళ, దేశమంతా రామనామ జపంతో తరిస్తుండగా.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, అంగరంగవైభవంగా పూర్తయింది. అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు 7వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరికి శ్రీరామ జన్మభూమి తీర్థం క్షేత్ర ట్రస్ట్ వారికి ప్రత్యేక కానుకలను అందించింది.

Ayodhya Mandir

సోమవారం ప్రాణప్రతిష్ఠ తరువాత అతిథులు శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇవాళ (మంగళవారం) నుంచి సామాన్య భక్తులందరూ బాలరాముడిని దర్శించుకొనేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం అర్థరాత్రి నుంచే మందిరం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే, రాముడిని దర్శించుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారు. ఆన్ లైన్ లో కానీ, ప్రత్యక్షంగా ఆలయం వద్ద పాస్ లు తీసుకోవాల్సి ఉంటుంది.

Ayodhya Mandir

ఆన్‌లైన్‌ బుకింగ్ ఇలా..

  • శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్  srjbtkshetra.org కు వెళ్లాలి.
  • మీ ఫోన్ నెంబర్ తో పాటు సైన్ఇన్ అయిన ఓటీపీ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • ఒకసారి లాగిన్ అయిన తరువాత.. మై ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి మీ గుర్తింపు వివరాలు, చిరునామా వంటివి నమోదు చేయాలి.
  • ఆ తరువాత హారతి/దర్శనం టైమ్ స్లాట్లను ఎంచుకుని పాస్ కోసం బుక్ చేసుకోవాలి.
  • ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తరువాత కౌంటర్ లో మీ పాస్ లు తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.
  • పాస్ తీసుకున్న వాళ్లకే హారతి సమయంలో అనుమతిస్తారు.
  • పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది.
  • హారతి 30 నిమిషాల ముందు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉండాలి.
  • ఎంట్రీ పాస్ పై పేర్కొన్న క్యూఆర్ కోడ్ లను స్కాన్ చేసిన తరువాతే ఆలయంలోకి భక్తులకు అనుమతి ఉంటుంది.

Ayodhya Mandir

దర్శన సమయాలు..

  • భక్తులు రామాలయంలో ఉదయం 7గంటల నుంచి 1130 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఆలయ దర్శనం చేసుకోవచ్చు.
  • జాగరణ హారతి ఉదయం 6.30 గంటలకు జరుగుతుంది. ఈ హారతిలో పాల్గొనేవారు ఒకరోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • రాత్రి 7.30 గంటలకు సంధ్యాహారతి ఉంటుంది. అదేరోజు బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది.