వంటిళ్లు సేఫ్ : పేలని గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయి
ముంబై: హమ్మయ్య ఇక వంటిళ్లు సేఫ్‌గా ఉంటాయి. ఎలాంటి టెన్షన్లు అవసరం లేదు. బేఫికర్‌గా కిచెన్‌లోకి వెళ్లొచ్చు, వంటలు చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ పేలుతుందేమో అనే భయం

ముంబై: హమ్మయ్య ఇక వంటిళ్లు సేఫ్‌గా ఉంటాయి. ఎలాంటి టెన్షన్లు అవసరం లేదు. బేఫికర్‌గా కిచెన్‌లోకి వెళ్లొచ్చు, వంటలు చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ పేలుతుందేమో అనే భయం
ముంబై: హమ్మయ్య ఇక వంటిళ్లు సేఫ్‌గా ఉంటాయి. ఎలాంటి టెన్షన్లు అవసరం లేదు. బేఫికర్‌గా కిచెన్‌లోకి వెళ్లొచ్చు, వంటలు చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ పేలుతుందేమో అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. పేలడానికి అవకాశమే లేని బ్టాస్ట్ ప్రూఫ్ వంట గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయి. ప్రస్తుతం ఉన్న మెటాలిక్ గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. దీంతో వీటికి అల్టర్‌నేట్‌గా పేలే అవకాశం లేని సిలిండర్లు తీసుకురావాలని చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడా రోజు వచ్చేసింది. దేశంలోనే తొలిసారిగా బ్లాస్ట్ ప్రూఫ్, ఫైబర్ మేడ్ వంట గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయి. ఇవి 100శాతం బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండర్లు.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వీటిని లాంచ్ చేశారు. గో గ్యాస్ ఎలైట్ ఎల్పీజీ సిలిండర్లుగా పిలిచే వీటిన కాన్ఫిడెన్స్ పెట్రోలియం ఇండియా లిమిటెడ్, టెక్నో ప్లాస్ట్ అసిసోయేషన్‌తో తయారు చేశారు. ప్రస్తుతం ఉన్న మెటాలిక్ సిలిండర్లతో పోలిస్తే ఇవి బరువు తక్కువ. బ్లాస్ట్ ప్రూప్ పైగా ట్రాన్సలెంట్ కూడా. కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. భవిష్యత్తులో వంట గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలు ఎక్కడా జరగవని కంపెనీ అధికారులు చెప్పారు.
మెటల్‌తో చేసిన గ్యాస్ సిలిండర్లతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఎందుకు, ఎలా బ్లాస్ట్ అవుతున్నాయో కూడా తెలియదు. ఈ ప్రమాదాల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం ఉంటోంది. దీంతో పేలుడికి అవకాశం లేకుండా సేఫ్‌గా ఉండే ప్రత్యామ్నాయ గ్యాస్ సిలిండర్ల తయారీపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఫైబర్‌తో గ్యాస్ సిలండర్ల తయారీ చేసే ఐడియా వచ్చింది. రెండేళ్లుగా వీటిపై వర్కవుట్ చేశారు. చివరకు సక్సెస్ అయ్యారు. ఫైబర్‌తో గ్యాస్ సిలిండర్లను తయారు చేశారు. 100శాతం పేలే అవకాశం లేని ఫైబర్‌తో చేసిన వంట గ్యాస్ సిలిండర్లు వచ్చేశాయ్ అనే వార్త వినియోగదారుల్లో ఆనందం నింపింది. ఎప్పుడెప్పుడు అవి తమ ఇంటికి చేరుతాయా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఫైబర్ సిలిండర్ ప్రత్యేకతలు:
* తుప్పు పట్టవు
* యువీ ప్రొటెక్టెడ్
* నేచర్ ఫ్రెండ్లీ
* ఎంత గ్యాస్ ఉందో చూసుకునే వెసులుబాటు
* మెటాలిక్ సిలిండర్లతో పోలిస్తే బరువు తక్కువ
* పేలే ప్రమాదం ఉండదు