iQOO Z10 Lite 5G : అద్భుతమైన ఆఫర్.. ఐక్యూ Z10 లైట్ 5G అతి చౌకైన ధరకే.. జస్ట్ ఎంతంటే?

iQOO Z10 Lite 5G : ఐక్యూ Z10 లైట్ 5G ఫోన్ ఆఫర్ అదిరింది.. అతి తక్కువ ధరకే ఈ ఐక్యూ సొంతం చేసుకోవచ్చు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iQOO Z10 Lite 5G : అద్భుతమైన ఆఫర్.. ఐక్యూ Z10 లైట్ 5G అతి చౌకైన ధరకే.. జస్ట్ ఎంతంటే?

iQOO Z10 Lite 5G

Updated On : June 28, 2025 / 6:43 PM IST

iQOO Z10 Lite 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. మంచి కెమెరాతో పాటు లాంగ్ లైఫ్ బ్యాటరీ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఐక్యూ Z10 లైట్ 5G (iQOO Z10 Lite 5G) ఫోన్ ధర భారీగా తగ్గింది.

ఐక్యూ మోడల్ అత్యంత సరసమైన ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే.. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐక్యూ Z10 లైట్ 5G ధర, ఆఫర్లు :
ఈ ఐక్యూ మోడల్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 14,999కు లిస్ట్ అయింది. అమెజాన్ నుంచి 27శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ధర రూ. 10,999కు కొనుగోలు చేయొచ్చు.

ఆఫర్ల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫర్ల కింద ఫెడరల్ బ్యాంక్ కార్డుపై రూ.824 తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుపై రూ.329 తగ్గింపును పొందవచ్చు. రూ.10,400 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ పొందవచ్చు.

Read Also : JioFiber : జియోఫైబర్ యూజర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్‌తో ఫ్రీ OTT, అన్‌లిమిటెడ్ Wi-Fi సర్వీసులు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఈఎంఐ ఆప్షన్ :
రూ. 533 ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ టైటానియం బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ 2 కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

ఐక్యూ Z10 లైట్ 5G డిస్‌ప్లే :
ఈ ఐక్యూ 6.67-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ కూడా కలిగి ఉంది. 1TB వరకు స్టోరేజీని విస్తరించవచ్చు.

కెమెరా సెటప్ :
ఫొటోగ్రఫీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. సెకండరీ కెమెరా 2MP కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 8MP కెమెరా కలిగి ఉంది.

బ్యాటరీ లైఫ్ :
బ్యాటరీ బ్యాకప్ కోసం.. ఈ ఐక్యూ ఫోన్‌లో భారీ 6000mAh బ్యాటరీ కలిగి ఉంది. 5 ఏళ్ల వారంటీతో వస్తుంది. అంతేకాదు.. ఈ ఐక్యూ ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది.