JioMart MS Dhoni : జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని.. ఈ నెల 8 నుంచి ’జియోఉత్సవ్‘ క్యాంపెయిన్..!

JioMart MS Dhoni : జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోనిని రిలయన్స్ రిటైల్ నియమించింది. ఈ నెల 8 నుంచి ’జియోఉత్సవ్‘ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.

JioMart MS Dhoni : జియోమార్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోని.. ఈ నెల 8 నుంచి ’జియోఉత్సవ్‘ క్యాంపెయిన్..!

JioMart welcomes Mahendra Singh Dhoni as brand ambassador

JioMart MS Dhoni : భారత ప్రముఖ ఈ-మార్కెట్లలో ఒకటైన రిలయన్స్ రిటైల్ (Reliance Retail) అయిన జియోమార్ట్ (JioMart)కు భారత క్రికెట్ ఐకాన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni)ని తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

అంతేకాకుండా, జియోమార్ట్, అక్టోబరు 8, 2023 ప్రారంభం అయ్యే జియోఉత్సవ్ (JioUtsav), ‘సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా’ ఫెస్టివల్ క్యాంపెయిన్ (Celebrations Of India) కొరకు రీ-బ్రాండ్ చేసింది. జియోమార్ట్ ఉత్సవ్ క్యాంపెయిన్‌లో భాగంగా క్రికెట్ లెజెండ్ ధోనీ 45 సెకన్ల పాటు కనిపిస్తాడు. ప్రియమైనవారితో ఆనందం, పండుగలు, ప్రత్యేక సందర్భాలలో మధురమైన క్షణాలను గుర్తుచేసేలా ఉంటుంది.

60శాతం వాటాతో నాన్ మెట్రా ప్రాంతాలు :
జియోమార్ట్ సీఈఓ సందీప్ వరగంటి మాట్లాడుతూ.. ‘జియోమార్ట్ మాదిరిగానే విశ్వాసం, విశ్వసనీయత, భరోసాకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తిత్వంతో ఎంఎస్ ధోని (MS Dhoni) మా బ్రాండ్ అంబాసిడర్‌గా సరిపోతారని భావించాం. కొత్త క్యాంపెయిన్‌లో ప్రియమైన వారితో జీవితాన్ని అనేక ప్రత్యేక క్షణాలను జియోమార్ట్‌లో ‘షాపింగ్’ చేయడం ద్వారా సంతోషంగా గడపవచ్చు.

Read Also : Best Smartphones in India : అక్టోబర్ 2023లో రూ. 35వేల లోపు ధరకే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ప్రస్తుతం జియోమార్ట్ మొత్తం అమ్మకాలలో నాన్-మెట్రో ప్రాంతాలు 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. క్రమంగా వృద్ధికి సంకేతం కూడా. డిజిటల్ రిటైల్‌ను మరింత అభివృద్ధి చేయడంలో ఇదే నిదర్శనం. స్వదేశీ ఇ-కామర్స్ బ్రాండ్‌గా మారిన జియోమార్ట్ అంటే ఎంతో విలువైనది. భారత మార్కెట్లో డిజిటల్ రిటైల్ విప్లవానికి మద్దతుగా నిలుస్తోంది’ అని అన్నారు.

JioMart welcomes Mahendra Singh Dhoni as brand ambassador

JioMart MS Dhoni as brand ambassador

జియోమార్ట్‌లో 1.5 లక్షల స్పెషల్ ప్రొడక్టులు :
ధోనీ మాట్లాడుతూ.. భారత్ చైతన్యవంతమైన సంస్కృతి, ప్రజలు, పండుగలకు పేరుగాంచింది. జియోమార్ట్ జియోఉత్సవ్ క్యాంపెయిన్ (JioMart, JioUtsav) దేశీయ వేడుకలకు భావగీతం వంటిది. జియోమార్ట్ అంబాసిడర్‌గా ఈ వేదికపైకి రావడం లక్షలాది భారతీయుల షాపింగ్ ప్రయాణంలో భాగం కావడం నాకెంతో సంతోషంగా ఉంది’ అని అన్నాడు. ప్రస్తుతం వెయ్యికి పైగా కళాకారులతో పనిచేస్తున్న జియోమార్ట్.. 1.5 లక్షల ప్రత్యేక ఉత్పత్తులను విక్రయిస్తోంది.

గత ఏడాదిలో జియోమార్ట్ వివిధ విభాగాలలో ఉత్పత్తులను అందించే హారిజాంటల్, క్రాస్-క్యాటగిరీ ధోరణిని అవలంబించింది. ఎలెక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకు బ్యూటీ నుంచి ఇంటి అలంకరణ వరకు, జియోమార్ట్ అనేక రిలయన్స్ సొంత బ్రాండ్స్‌ను చేర్చింది. ఇందులో అర్బన్ లాడర్, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ జివెల్స్, హాంలేస్ వంటివి ఉన్నాయి. ఈ వేగవంతమైన విస్తరణలో భారత్‌లోనే అతిపెద్ద హోమ్-గ్రోన్ ఈ-మార్కెట్ ప్లేస్ కావాలనే జియోమార్ట్ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది.

Read Also : MG ZS EV Price Cut : ఈ MG ఎలక్ట్రిక్ SUV కారు ధర భారీగా తగ్గిందోచ్.. ఫుల్ ఛార్జ్‌పై 461కి.మీ వరకు దూసుకెళ్తుంది!