Keeway: ఆనాటి కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చేలా రెండు కొత్త బైకులను విడుదల చేసిన కీవే
ఆధునిక సాంకేతికతతో ఉన్నప్పటికీ కస్టమర్‌లు 80, 90ల నాటి అనుభవాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. Keeway SR 125 ఇప్పటికే విక్రయంలో ఉండగా, Keeway SR 250 డెలివరీలు జూన్ 17 నుండి ప్రారంభమవుతాయని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా పేర్కొంది.

Auto Expo 2023: అలనాటి కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చేలా ఇండియన్ సూపర్‌బైక్ పరిశ్రమలో ప్రముఖ తయారీదారు అయిన కీవే సంస్థ రెండు సరికొత్త బైకులను విడుదల చేసింది. వీటిని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకురానుంది. 98కి పైగా దేశాలలో ప్రాచుర్యం పొందిన హంగేరియన్ దిగ్గజం KEEWAY నుంచి అన్‌ప్రెటెన్షియస్ SR 250, SR 125 అనే రెండు మోడల్స్ ఉన్నాయి.
తాజాగా విడుదలైన ఈ మోటర్‌సైకిళ్లు పాతతరం నాటి జ్ఞాపికలుగా కనిపిస్తాయని కంపెనీ పేర్కొంది. ఆధునిక సాంకేతికతతో ఉన్నప్పటికీ కస్టమర్‌లు 80, 90ల నాటి అనుభవాన్ని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. Keeway SR 125 ఇప్పటికే విక్రయంలో ఉండగా, Keeway SR 250 డెలివరీలు జూన్ 17 నుండి ప్రారంభమవుతాయని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా పేర్కొంది.
Karnataka: ఆర్ఎస్ఎస్ పాఠాలు తొలగించి అంబేద్కర్ పాఠాలు తిరిగి ప్రవేశపెట్టిన కర్ణాటక ప్రభుత్వం
కీవే SR 250 మొదటి ఐదు వందల డెలివరీలకు లక్కీ డ్రాను AARI ప్రకటించింది. ఇందులో ఐదుగురు లక్కీ కస్టమర్‌లు ఎక్స్-షోరూమ్ ధరపై 100% క్యాష్‌బ్యాక్ పొందుతారు. కంపెనీ ‘మై SR మై వే’ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. కస్టమర్‌లు వారి SR మోడల్‌ల ద్వారా వారి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంది. సెప్టెంబర్ 2023 నుంచి అన్ని కొత్త కొనుగోళ్లలో ప్లాట్‌ఫారమ్ అందుబాటులో ఉంటుందని ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా పేర్కొంది.