Mahindra XUV300 Facelift : మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కారు వస్తోంది.. చివరి దశలో టెస్టింగ్..!

Mahindra XUV300 Facelift : మహీంద్రా చాలా కాలంగా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ కొత్త ఎక్స్‌యూవీ300 వెర్షన్ మోడల్ 2024 ప్రారంభంలో భారీ ఎక్స్‌ట్రనల్ ఇంటీరియర్ మార్పులతో భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.

Mahindra XUV300 Facelift : మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కారు వస్తోంది.. చివరి దశలో టెస్టింగ్..!

Mahindra XUV300 facelift continues testing in India

Updated On : November 25, 2023 / 10:41 PM IST

Mahindra XUV300 Facelift : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి సరికొత్త XUV300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారు వస్తోంది. ప్రస్తుతం ఈ కారు టెస్టింగ్ చివరి దశలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ కొత్త ఎక్స్‌యూవీ300 వెర్షన్ మోడల్ 2024 ప్రారంభంలో భారీ ఎక్స్‌ట్రనల్ ఇంటీరియర్ మార్పులతో భారత మార్కెట్లో ప్రవేశించనుంది. ఈ వీడియోలో చూసినట్లుగా.. టెస్ట్ మ్యూల్ కనెక్ట్ చేసే లైట్ బార్‌తో పూర్తిగా కొత్త ఎల్ఈడీ టైల్‌లైట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. బ్యాక్ వైపర్, రూఫ్ రెయిల్స్, పొడిగించిన రూఫ్ స్పాయిలర్ సాంప్రదాయిక యాంటెన్నా వంటి అంశాలు కూడా కనిపిస్తాయి.

ఏయే మార్పులు ఉండొచ్చుంటే? :
ముందువైపు, కొత్త ఎక్స్‌యూవీ700 వంటి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్ఎల్ సెటప్‌తో రీడిజైన్ చేసిన అతిపెద్ద మార్పుతో వస్తుంది. మీరు గమనిస్తే.. ఎక్స్‌యూవీ300 కొత్త ఫ్రంట్ ప్రొఫైల్‌తో పాటు రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త హెడ్‌లైట్‌లు, కొత్త డీఆర్ఎల్‌లు బంపర్‌తో సహా కొన్ని విజువల్ ట్వీక్‌లను కలిగి ఉంది. వెనుక ప్రొఫైల్ కొత్త లైట్లు, కనెక్ట్ చేసిన ఎల్ఈడీ స్ట్రిప్, కొత్త బంపర్‌ను పొందుతుంది. కొత్త అల్లాయ్ వీల్ డెసింగ్ మినహా సైడ్ ప్రొఫైల్ ఎక్కువ లేదా తక్కువ అలాగే ఉంటుంది.

Read Also : 2023 Royal Enfield Himalayan : రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త హిమాలయన్ అడ్వెంచర్ బైక్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?

ఇంటీరియర్ విషయానికొస్తే.. ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఎక్స్‌యూవీ300 క్యాబిన్‌కు మరింత అత్యాధునిక అనుభూతిని కలిగిస్తుంది. కొత్త ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, ఎయిర్‌కాన్ వెంట్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త అప్హోల్స్టరీ మరిన్ని ఫీచర్లను పొందే అవకాశం ఉంది. రాబోయే ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ అదే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌లతో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతుందని భావిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత అప్‌గ్రేడ్ ఎక్స్‌యూవీ300 టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ సెగ్మెంట్‌లోని ఇతర సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీలకు పోటీగా కొనసాగుతుంది.

Mahindra XUV300 facelift continues testing in India

Mahindra XUV300 facelift testing 

పనోరమిక్ సన్‌రూఫ్‌ రేంజ్ టాపింగ్ వేరియంట్‌ : 

2024 మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ లోపల కూడా గణనీయమైన మార్పులను పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ సరికొత్త రూపాన్ని అందించనుంది. కొత్త ట్రెండ్ ప్రకారం.. పెద్ద ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. మహీంద్రా కొత్త ఎక్స్‌యూవీ300తో సెగ్మెంట్-ఫస్ట్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను రేంజ్ టాపింగ్ వేరియంట్‌లలో అందిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ 6-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఎఎంటీ) స్థానంలో ఐసిన్-సోర్స్డ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌ను పొందుతుందని నివేదించింది. అయితే, ఇంజన్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

కాంపాక్ట్ ఎస్‌యూవీ 110 హెచ్‌పీ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 131 హెచ్‌పీ 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్, 117హెచ్‌పీ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందించనుంది. మహీంద్రా ఇంకా లాంచ్ టైమ్‌లైన్‌ను అధికారికంగా వెల్లడించలేదు. అయితే, 2024 ప్రారంభంలో షోరూమ్‌లలోకి ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వస్తుందని భావిస్తున్నారు. ఇందులో టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ లైక్‌లతో పోటీపడనుంది.

Read Also : Royal Enfield Shotgun 650 : ఇది కదా బైక్ అంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్ లాంచ్, ఫీచర్లు, ధర ఎంతంటే?