బుల్ జోరు : కళకళలాడుతున్న మార్కెట్లు

  • Published By: madhu ,Published On : September 23, 2019 / 05:07 AM IST
బుల్ జోరు : కళకళలాడుతున్న మార్కెట్లు

Updated On : September 23, 2019 / 5:07 AM IST

స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది.  కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల నేపథ్యంలో గత వారాంతంలో రికార్డు లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం జోరు కొనసాగించింది. సెన్సెక్స్ 1300 పాయింట్లతో 39 వేల మార్క్‌ను చేరుకుంది. నిఫ్టీ 300 పాయింట్లతో 11 వేల 500 మార్క్‌ని టచ్ చేసింది.

సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు పైగా ఎగబాకగా… నిఫ్టీ 250  పాయింట్లకు పైగా లాభపడింది. బ్రిటానియా షేర్లు 25 శాతం పెరిగాయి. ఎన్ఎస్‌‌లో ఐటీసీ 8 శాతం పెరిగింది. బ్యాకింగ్, ఆటో ఇన్ ఫ్రా సెక్టార్లకు సంబంధించిన షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. హోటళ్లపై జీఎస్టీ తగ్గింపు చేస్తున్నట్లు ఇటీవలే మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటన చేయడంతో ఈ రంగానికి చెందిన షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

ఐటీసీ, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, ఎల్ అండ్ టి, ఎంఅండ్ఎం, ఏషియన్ పేయింట్స్, మారుతీ సుజుకి, ఇతర కంపెనీలు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. ఫార్మా, ఐటీ సెక్టార్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు డాలర్ పోలిస్తే రూపాయి 70.99 వద్ద కొనసాగుతోంది. కొత్తగా ప్రకటించిన ఆర్థిక చర్యలతో దేశీయ మార్కెట్లలో భయం పోయిందని, మార్కెట్లు ఉత్సాహంతో ముందుకెళుతున్నాయని వ్యాపార నిపుణులు తెలియచేశారు. 
Read More :