ప్రపంచంలోనే ఫస్ట్ : 108MP భారీ కెమెరాతో Mi Note 10 వస్తోంది

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి భారీ కెమెరాతో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా 108 పెంటా మెగా ఫిక్సల్స్ కెమెరాతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే.. Mi Note 10. ఈ మోడల్ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కంపెనీ అధికారిక టీజర్ ను రిలీజ్ చేసింది. 2017లో Mi Note 3 రిలీజ్ చేసిన షియోమీ కంపెనీ నుంచి ఇదే తొలి భారీ కెమెరా ఫోన్ కావడం విశేషం. Mi Note 10 సిరీస్ ల్లో Mi Note 10 ప్రోకు సంబంధించి థాయిలాండ్, రష్యాలో ఇటీవలే కంపెనీ సర్టిఫికేషన్ పొందింది.
తొలి టీజర్ ఆధారంగా పరిశీలిస్తే.. Mi Note 10 ఫోన్ Mi CC9 Proకు గ్లోబల్ వేరియంట్ మాదిరిగా కనిపిస్తోంది. మరో మోడల్ Mi CC9 ప్రో లాంచింగ్ టీజర్ ను రిలీజ్ చేయడానికి కొన్ని గంటల ముందే షియోమీ Mi Note 10 మోడల్ ధ్రువీకరించింది. ఈ రెండు మోడల్స్ చైనాలో వచ్చే నవంబర్ 5న లాంచ్ కానున్నాయి. రెండు స్మార్ట్ ఫోన్లలో 108MP పెంటా కెమెరా సెటప్ తో దాదాపు ఒకే మాదిరిగా ఉండనున్నాయి. ఈ రెండెంటి స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు ఒకేలా ఉన్నప్పటికీ వేర్వేరు ప్రాసెసర్లు ఆఫర్ చేస్తున్నట్టు టిప్ స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Mi Note 10 మోడల్ Mi CC9 proకు ఇంటర్నెషనల్ వెర్షన్ గా రాబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్ తో పాటు Mi Note 10 Proను కూడా షియోమీ రిలీజ్ చేస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఈ మోడల్ కూడా థాయిలాండ్, రష్యాలో సర్టిఫై అయింది. రూమర్ల ఆధారంగా పరిశీలిస్తే.. Mi CC9 ప్రో ఫీచర్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ ఉంది.
మరోవైపు Mi Note 10, Mi Note 10 ప్రోలో ఫ్లాగ్ షిప్ స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ చిప్ సెట్ ఉండగా, 120Hz రీఫ్రెస్ రేట్ ఉంది. ఫీచర్లు, స్పెషిఫికేషన్ల విషయంలో షియోమీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అంతేకాదు.. Mi Note 10లో టాప్ సైడ్ వెనుక భాగంలో వర్టికల్ సైజులో 5 కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ లో శాంసంగ్ భాగస్వామ్యంతో రూపొందిన 108-megapixel ISOCELL Bright HMX sensor ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
Xiaomi Mi Note 10 ఫీచర్లు ఇవే :
* 6.47 అంగుళాల డిస్ ప్లే
* రెజుల్యూషన్ (1080×2340ఫిక్సల్స్)
* 108MP + 20MP + 12MP కెమెరాలు
* ఫ్రంట్ కెమెరా 32MP
* 6GB RAM + 64GB స్టోరేజీ
* 5170mAh బ్యాటరీ సామర్థ్యం
* ఆండ్రాయిడ్ 9 OS
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 730G
Introducing the world’s FIRST 108MP Penta Camera. A new era of smartphone cameras begins now! #MiNote10 #DareToDiscover pic.twitter.com/XTWHK0BeVL
— Xiaomi #First108MPPentaCam (@Xiaomi) October 28, 2019
Both the Mi Note 10 and the CC9 Pro will share a lot of features.
The SoC will be the differentiating factor.#Xiaomi #redmi #cc9pro #mismartwatch #MiTV5 #MiNote10— Mukul Sharma (@stufflistings) October 28, 2019